Rashmika Mandanna Adipurush.. అవునండీ.! ‘రష్మికను చూస్తే రావణుడు పారిపోతాడట..’ సోషల్ మీడియాలో నడుస్తోన్న మీమ్ ఇది. తెగ ట్రెండింగ్ అయిపోతోంది నెట్టింట ఈ మీమ్ ఇప్పుడు.
అసలు విషయమేంటంటే, లేటెస్ట్‌గా ‘ఆదిపురుష్’ సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని క్యారెక్టర్లు, కొన్ని కొన్ని సన్నివేశాలు.. ఏ రేంజ్‌లో విమర్శలకు గురయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
తాజా మీమ్ మాత్రం వీటన్నింటికీ విభిన్నం. నెక్స్‌ట్ లెవల్ ట్రెండింగ్‌లో వుంది. ‘ఆదిపురుష్’ సినిమాలో సీత పాత్ర పోషించింది అందాల భామ కృతి సనన్.
Rashmika Mandanna Adipurush.. కృతి సనన్ అందగత్తె.! రష్మిక కాదా.?
సినిమా ఎలా వున్నా.. సీత పాత్రలో కృతి సనన్ బాగుంది. సరే.. ఆ పాత్రను ఎలా చూపించారన్న విషయం, వివాదం కాసేపు పక్కన పెడితే, సీతగా కృతి అందంగానే కనిపించింది.

ఒకవేళ ఆ పాత్రలో రష్మిక మండన్నా నటిస్తే ఎలా వుంటుందో ఊహించుకున్నారా.? ఓకే బాగానే వుంటుంది. అయితే, సీత పాత్రలో రష్మికను చూసి రావణుడు పారిపోతాడంటూ మీమ్ నెట్టింటై వైరల్ అవుతోంది.
‘ఆదిపురుష్’ సినిమాలో సీత పాత్రలో వున్న కృతి సనన్‌ను ఎత్తుకెళ్లడానికి రావణాసురుడు వస్తాడు. ఆమె అందానికి మోహించి ఆమెను ఎత్తుకెళ్లిపోతాడు.
రష్మికకు ఏం తక్కువ.?
అదే పాత్రలో ఒకవేళ రష్మిక వుంటే, ఆమె ముఖం చూసి రావణుడే పారిపోతాడు.. అంతేనా కాస్త చిల్లర కూడా విసిరేసి పోతాడు.. అంటూ సదరాగా ఓ ఫన్నీ మీమ్ క్రియేట్ చేశారు.

కృతి సనన్ ప్లేస్‌లో రష్మిక ఫోటోను మార్పింగ్ చేసి ఈ మీమ్ వదిలారు. నిజంగానే రియలిస్టిక్‌గా వుందీ మార్ఫింగ్ ఫోటో.
అయితే, ఈ మీమ్ చూసి కొందరు ఫన్ ఫీలవుతుంటే.. రష్మిక డై హార్ట్ ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. అంతేగా.! అయినా రష్మక (Rashmika Mandanna) కు ఏం తక్కువ.? సౌత్‌లో స్టార్ హీరోయిన్ రష్మిక మండన్నా.
నేషనల్ క్రష్ కూడా. నేషనల్ క్రష్ అంటే కృతి సనన్ కంటే పాపులారిటీ రష్మికకే ఎక్కువ. అలాంటిది రష్మికపై ఇలాంటి మీమ్స్ ఏంటీ.? కానీ, ఈ మీమ్ నెట్టింట జెట్ స్పీడులో వైరల్ అవుతోందిప్పుడు.
ప్రస్తుతం రష్మిక బాలీవుడ్‌లో ‘యానిమల్’ సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రణ్‌బీర్ కపూర్‌తో ఈ సినిమాలో రష్మిక (Rashmika Mandanna) జోడీ కడుతోంది.
Also Read: సిగ్గొదిలేశారు.! ‘సీఎంవో’లో మహిళా జర్నలిస్టుల కొట్లాట.!
అలాగే, తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ‘పుష్ప 2’ సినిమాలో నటిస్తోంది. రష్మిక ప్రధాన పాత్రలో ‘రెయిన్‌బో’ అనే హీరోయిన్ సెంట్రిక్ మూవీ కూడా తెరకెక్కుతోంది.