Rashmika Mandanna Crush.. రష్మిక మండన్నా.. ఈ పేరు చెబితేనే కుర్రకారులో ఏదో తెలియని వైబ్రేషన్. అంతలా తన ఇమేజ్‌ని బిల్డప్ చేసుకుంది కన్నడ కసూర్తి రష్మిక మండన్నా.
అతి తక్కువ టైమ్‌లోనే తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా సొంతం చేసుకుంది రష్మిక. ఈ ఇమేజ్‌ని బాలీవుడ్‌లో మరింత డబుల్ చేసుకునే ప్రయత్నాల్లో ప్రస్తుతం బిజీగా వుంది.
ఓ వీడియో ఆల్బమ్‌తో బాలీవుడ్‌లో క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలూ దక్కించుకుంటోంది.
Rashmika Mandanna Crush.. రష్మిక స్సెషల్ అదే..
బాలీవుడ్‌లో ఇంకా బ్లాక్ బాస్టర్ హిట్ అనదగ్గ సినిమాలేమీ పడలేదు కానీ, రష్మిక అంటే, రష్మిక అంతే. అందుకే నేషనల్ క్రష్. ఆ క్రష్‌కే బాలీవుడ్ సైతం ఆమెకు ఫిదా అవుతోంది.

ఇక, ప్రస్తుతం ‘ఏనిమల్’ సినిమాలో నటిస్తోంది. అలాగే, తెలుగు విషయానికి వస్తే, ‘పుష్ప’ సినిమాతో రష్మిక క్రేజ్ ప్రపంచం మొత్తం మార్మోగిపోయిందనే చెప్పాలి.
అదే క్రేజ్‌ని కంటిన్యూ చేస్తూ ‘పుష్ప 2’లో నటిస్తోంది. అలాగే ‘రెయిన్ బో’ అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీకీ ఇటీవల రష్మిక సైన్ చేసింది.
‘గ్రాజియా’ గాళ్ ఆఫ్ మూమెంట్..
ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్‌లోనూ రష్మిక టాప్‌లో కొనసాగుతుండడం విశేషం. అలాగే, సోషల్ మీడియాలో అమ్మడి జోరు అంతా ఇంతా కాదు.

తాజాగా ‘గ్రాజియా’ కవర్ పేజ్‌పై తళుక్కున మెరిసింది రష్మిక మండన్నా. ‘రష్మిక మండన్నా గాళ్ ఆఫ్ మూమెంట్..’ అంటూ ఈ కవర్ పేజ్‌పై రష్మిక అల్ర్టా మోడ్రన్ పోజులు కిర్రాకెత్తిస్తున్నాయ్.
Also Read: తమన్నా.! ప్చ్.. ‘బాహుబలి’ సక్సెస్‌ని క్యాష్ చేసుకోలేక.!
అసలే యూత్‌లో బోలెడంత క్రేజ్ వున్న రష్మిక ఈ తాజా లుక్స్‌కి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. ఈ పోటోల్ని నెట్టింట ట్రెండింగ్ చేస్తున్నారు.