అయ్యోపాపం.! కన్నడ సినీ పరిశ్రమలో రష్మికని (Rashmika Mandanna) బ్యాన్ చేస్తారట. సొంత గడ్డ మీద బ్యాన్ ఎదుర్కోవాల్సి వస్తే.. కన్నడ కస్తూరి రష్మిక మండన్న పరిస్థితేంటి.?
ఔనూ, కన్నడంలో రష్మిక ఇప్పుడు చేస్తున్న సినిమాలేంటీ.? నిజానికి, ఏమీ లేవ్.! అలాగైతే, బ్యాన్ చేసి ఉపయోగమేంటి.?
స్ట్రెయిట్ సినిమాల్లేకపోతేనేం, డబ్బింగ్ సినిమాలుగా రష్మిక నటించిన తెలుగు, తమిళ అలాగే హిందీ సినిమాలు విడుదలవుతాయ్ కదా.! వాటి విషయంలో గోల చేస్తామంటున్నారట కన్నడిగులు.
Rashmika Mandanna తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందాన..
రష్మిక ఏమంత పెద్ద నేరం చేసిందని.? తొలి సినిమా నిర్మాణ సంస్థ గురించి చెప్పడానికి ఇష్టపడకపోవడమే రష్మిక చేసిన నేరమట. ఇందులో వింతేముంది.? తప్పేముంది.? అది ఆమె ఇష్టం.
‘కిరిక్ పార్టీ’ అనే కన్నడ సినిమాతో రష్మిక రాత్రికి రాత్రి స్టార్ అయ్యింది. ఆ సినిమా పరిచయంతోనే రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది రష్మిక.

కొన్ని అనివార్య కారణాలవల్ల ఎంగేజ్మెంట్ కూడా రద్దు చేసేసుకున్నారు ఇరువురూ. అప్పటినుంచే రష్మిక వర్సెస్ రక్షిత్ శెట్టి రచ్చ కొనసాగుతూ వుంది.
‘కాంతారా’తో మళ్ళీ మొదలైన రచ్చ..
రక్షిత్ శెట్టి తాజా సంచలనం ‘కాంతారా’ గురించి రష్మికని ప్రశిస్తే, ఆ సినిమా చూడలేదని చెప్పిందామె. అంతే, కన్నడ నేల మీద నుంచి నటిగా ఎదిగి, కన్నడ సూపర్ హిట్ సినిమా చూడలేదా.? అంటూ ట్రోల్ చేశారామెని.
ఇలా పలు వివాదాల నేపథ్యంలో రష్మికపై బ్యాన్ విధించాలంటూ కన్నడ సినీ ప్రముఖులు కొందరు తీర్మానాలు చేసేస్తున్నారు.
‘వారిసు’ సంక్రాంతికి విడుదల కాబోతోంది. అందులో విజయ్ సరసన హీరోయిన్‌గా నటించింది రష్మిక. తమిళ సినిమా ఇది. దీన్ని కర్నాటకలో విడదల కానీయబోమని అంటున్నారు.
Also Read: జస్ట్ ఆస్కింగ్: బతికే వున్నావని గ్యారంటీ ఏంటి.?
ఫర్ సపోజ్ ‘వారిసు’ కర్నాటకలో విడుదల కాకపోతే రష్మికకి వచ్చిన నష్టమేంటి.? నిర్మాత కదా, నష్టపోయేది.? అలా నిర్మాత నష్టపోయే పరిస్థితి వస్తే, రష్మికకీ అవకాశాలు తగ్గుతాయ్.!
కానీ, అలా జరిగే అవకాశముందా.? ఏమో, జరిగినా జరగొచ్చు. నేషనల్ క్రష్ రష్మిక విషయంలో కన్నడిగులు ఇంత సిల్లీగా ఎలా ఆలోచిస్తున్నారబ్బా.?