Rashmika Mandanna Kannada సక్సెస్ ఇచ్చే కిక్కు.. ఫ్లాప్ వేసే మొట్టికాయ.. సినీ సెలబ్రిటీల్లో చిత్ర విచిత్రమైన మార్పుల్ని తెస్తుంటాయ్.
అహాంకారంతో విర్రవీగడం.. కుక్కిన పేనులా మారిపోవడం.. ఇవన్నీ తప్పవ్ కొందరికి.!
విర్రవీగిన రష్మిక మండన్న ఎలా బొక్క బోర్లా పడింది.? ఈ చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమల్లో రష్మిక మండన్న ఓ ఊపు ఊపేస్తోంది. మొన్నీమధ్యనే ‘వారిసు’ సినిమాతో తమిళ ప్రేక్షకుల్ని పలకరించింది.
తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదలైన ఆ సినిమా ఫలితం ఏంటి.? అన్నది వేరే చర్చ. తాజాగా ఓటీటీ వేదిక రష్మిక సినిమా ‘మిషన్ మజ్ఞు’ సినీ అభిమానుల ముందుకొచ్చింది.
Rashmika Mandanna Kannada.. అప్పుడెగిరింది.. ఇప్పుడు దిగొచ్చింది..
కొన్నాళ్ళ క్రితం ఓ ఇంటర్వ్యూలో తన తొలి సినిమా గురించి మాట్లాడేందుకు చాలా ఓవరాక్షన్ చేసింది రష్మిక. ఆ సినిమా నిర్మాణ సంస్థ పేరునీ చెప్పలేదు. దర్శకుడి పేరు చెప్పేందుకూ ఇష్టపడలేదు.
‘కిరిక్ పార్టీ’ పేరుతో వచ్చిన ఆ సినిమాతోనే రష్మిక రాత్రికి రాత్రి స్టార్ అయ్యింది. రిషబ్ శెట్టి – రక్షిత్ శెట్టి అప్పట్లో రష్మికకి అండదండలందించారు.
అందులో రక్షిత్ శెట్టితో రష్మిక మండన్నకి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఆ తర్వాత ఆ బంధం అక్కడితోనే తెగిపోయింది.
ఇప్పుడెందుకు వాళ్ళు గుర్తొచ్చారబ్బా.?
తాను ఇప్పుడు ఈ స్థితిలో వున్నానంటే దానికి కారణం, రక్షిత్ శెట్టి అలాగే రిషబ్ శెట్టి.. అంటూ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది రష్మిక మండన్న.

‘కాంతారా’ గురించి దేశమంతా మాట్లాడుకుంటున్నా, ‘ఆ సినిమా చూడలేదు, దాని గురించి తెలీదు..’ అని నిర్లక్ష్యంగా రష్మిక గతంలో సమాధానమిచ్చింది. ఇప్పుడు అదే రష్మికలో మార్పు వచ్చింది.
ఇంతకీ ఏం జరిగింది.? ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుండడం.. కన్నడ సినీ అభిమానులు రష్మిక పొగరుమోతుతనంపై గుస్సా అవుతుండడంతో.. నిర్మాతలే ఆమెపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: ‘ది మ్యాడ్ క్వీన్ అనసూయ’.! ఇలా తిట్టేశారేంటబ్బా.!
అద్గదీ అసలు సంగతి.! అయితే, రష్మిక బుకాయింపులు మాత్రం కొనసాగుతూనే వున్నాయ్. తాను ఎప్పుడూ ఎవర్నీ ద్వేషించలేదనీ, దూరం పెట్టలేదనీ చెబుతోందామె.
కింద పడ్డా పై చేయి తనదేనని చెప్పడమంటే ఇదే మరి.!