Table of Contents
Rashmika Mandanna Marriage And Love.. నేషనల్ క్రష్ రష్మిక పెళ్లి చేసుకోబోతోందా.? ఏమో.! కానీ, ప్రేమ, పెళ్లి అనే అంశాలపై రష్మిక పక్కా క్లారిటీతో వుందనిపిస్తోంది. ప్రేమకు అర్ధం ఇదే.. నాకు కాబోయే వరుడు ఇలా వుంటే బాగుంటుందని తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన అంశాలను షేర్ చేసింది రష్మిక.
కెరీర్ పరంగా చాలా చాలా బిజీగా వుంది ప్రస్తుతం రష్మిక. వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్తోంది. ‘పుష్ప’ సినిమాతో ఇంతకు ముందు కన్నా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.
దటీజ్ కన్నడ కస్తూరి రష్మిక.!
తాజాగా ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రష్మిక. ఈ సినిమా ప్రమోషన్స్‌లో హుషారుగా పాల్గొంటోంది. ఇక ప్రమోషన్స్ అంటే, సినిమా విషయాలే కాదు, కొన్ని పర్సనల్ విషయాలూ షేర్ చేయాల్సి వస్తుంటుంది కదా.

ఆ క్రమంలోనే ప్రేమ, పెళ్లి ప్రస్థావనలు ఆమె ముందుకొచ్చాయ్. వాటికి ఆసక్తికరంగా ఆన్సర్లు చెప్పి మరోసారి దటీజ్ ‘క్రష్మిక’ అనిపించుకుంది రష్మిక.
Rashmika Mandanna Marriage And Love.. ఇంతకీ రష్మిక దృష్టిలో ప్రేమంటే..
ప్రేమ ఒక అద్భుతం అంటోంది రష్మిక. అంతేకాదు, ప్రేమ అంటే గౌరవం ఇచ్చి పుచ్చుకోవడం.. ఒకరికపై మరొకరికి పూర్తిగా నమ్మకం ఏర్పడడం.. అది వర్ణించలేని ఓ భావోద్వేగం.. ఈ భావోద్వేగం రెండు వైపుల నుంచీ వుండాలనీ, ఒక వైపు నుంచి మాత్రమే వుంటే, ఆ ప్రేమ సక్సెస్ కాదని చక్కగా ప్రేమకు నిర్వచనం ఇచ్చింది రష్మిక.
ఎవరితో అయితే, తాను సెక్యూర్‌గా ఫీలవుతుందో, ఎవరితో కలిసి వుంటే, తను సంతోషంగా వుండగలదో ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటాననీ రష్మిక చెప్పింది. ఒకవేళ ప్రేమ పెళ్లి చేసుకున్నా, పెద్దవాళ్ల అంగీకారంతోనే చేసుకుంటాననీ చెప్పింది.
పెళ్లి విషయంలో రష్మిక పక్కా క్లారిటీ..
ఇన్ని చెప్పిన రష్మిక.. తానింకా చిన్నపిల్లనే అంటోంది. పెళ్లికి ఇంకా చాలా టైముందని మాట దాటేసింది. అయినా ఏదో సినిమా ప్రమోషన్ కోసం రష్మిక ఇన్ని మాటలు చెప్పుకొచ్చింది కానీ, నిజానికి కెరీర్ మొదట్లోనే ప్రేమలో పడిపోయింది రష్మిక.

కన్నడలో రష్మిక నటించిన ‘కిర్రాక్ పార్టీ’ హీరోతో పీకల్లోతు ప్రేమాయణం సాగించిన రష్మిక, ఆ హీరోతో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. పైన చెప్పింది.. కదా. ఆ అభిప్రాయాలతో ఏకీభవించలేదు కాబోలు.. లవ్, ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకుని, కెరీర్‌లో ఫుల్ బిజీ అయిపోయింది.
Rashmika Mandanna Marriage And Love.. ఈ కొత్త ప్రేమ సంగతేంటి చెప్మా.!
రష్మిక తాజా ప్రేమ విషయానికొస్తే, టాలీవుడ్‌లో ఓ యంగ్ హీరోతో ఘాటుగా రొమాంటిక్ జర్నీ సాగిస్తోందనే గుసగుసలు గుప్పుమంటున్నాయ్.
Also Read: సొగసరి ముద్ర: బంగారమ్.. ఊర్వశి వయ్యారమ్.!
అదే విషయం రష్మికను అడిగితే.. అబ్బే.! నాకసలు ప్రేమించడానికే తీరిక లేనంత బిజీగా వున్నానంటూ ఎస్కేప్ అయిపోతుంది. ఇక పెళ్లి (Rashmika Mandanna Marriage And Love) ముచ్చటంటారా.? దానికి ఇంకా చాలా టైముందని ముందే చెప్పేసిందిగా.!
హీరోయిన్లు పెళ్ళి చేసుకునేదాకా ఓ చర్చ, పెళ్ళయ్యాక ఇంకో రచ్చ.! గ్లామర్ ప్రపంచం కదా, ఆ మాత్రం ‘సందడి’ లేకపోతే కిక్కేముంటుంది.? ప్రశ్నలు ఎప్పుడూ ఆగవ్.! పెళ్ళెప్పుడు.? అనే ప్రశ్న, విడాకులెప్పుడు.? అనే ప్రశ్న.. ఇదొక ప్రవాహం అంతే.!