Rashmika Mandanna.. ప్చ్.! రష్మిక మండన్నకి ఇంకో షాక్ తగిలేసింది.! అదీ బాలీవుడ్‌లో.!
అసలేమయ్యింది రష్మికకి.? బాలీవుడ్ ఎంట్రీ ఘనంగా వుంటుందనుకుంటే, పాపులారిటీ వచ్చినట్టే వచ్చి.. అటకెక్కిపోతోందక్కడ.!
రష్మిక నటించిన బాలీవుడ్ సినిమా ‘గుడ్ బై’ మొన్నామధ్యన విడుదలైంది. ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు పోయిందో కూడా తెలియదది. అమితాబ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనపించారు.
ఈ మధ్యనే ‘గుడ్ బై’ ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఓటీటీలోనూ ఎవరూ ఈ సినిమాని పట్టించుకోలేదు.
ఈసారి నేరుగా ఓటీటీలోకే..
ఇదిలా వుంటే, రష్మిక తాజా చిత్రం ‘మిషన్ మజ్ఞు’ కూడా రష్మికకి షాక్ ఇచ్చేసింది. ఈ సినిమాని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించేశారు నిర్మాతలు.
నెట్‌ఫ్లిక్స్ వేదికగా జనవరి 20న ‘మిషన్ మజ్ఞు’ స్ట్రీమింగ్ కాబోతోంది.

ఓటీటీలో విడుదలవుతున్నంతమాత్రాన తక్కువగా చూడాల్సిన పనిలేదుగానీ, రష్మిక బాలీవుడ్ కలలిలా నీరుగారిపోతుండడమే ఆమె అభిమానుల్ని ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది.
కోవిడ్ లేదుగా.. ఎందుకింకా ఓటీటీని పట్టుకుని వేలాడుతున్నారు.? సహజంగానే ఈ ప్రశ్న తెరపైకొస్తోంది.
థియేటర్లు వేస్ట్.. ఓటీటీ బెస్ట్..
నిజానికి, థియేటర్లలో సినిమా చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడంలేదు. ఎందుకు.? అంటే, దానికి చాలా కారణాలున్నాయి.
Also Read: Mrunal Thakur.. ‘జిలేబీ’ బ్యూటీ.. చాలా నాటీ.!
అయినా, అందరూ ఇంట్లోనే కూర్చుని ఉచితంగా సినిమాని చూసే అవకాశం వున్నప్పుడు, థియేటర్లకు వెళ్ళి వందలు, వేలు ఎందుకు ఖర్చు చేయాలి.?
ఇదీ సగటు ప్రేక్షకుడి ఆలోచన. ఆ ఆలోచనకి తగ్గట్టే సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలవుతోంటే, థియేటర్లెందుకిక దండగ కాకపోతే.!