Sri Satya Bigg Boss.. శ్రీసత్య.. ఈ పేరుకు ఇప్పుడు పరిచయం అక్కర్లేదు. క్యూట్ అండ్ లవ్లీగా బిగ్‌బాస్ హౌస్‌ని ఏలేస్తోన్న యువరాణి శ్రీ సత్య.
సీరియల్స్‌లోంచి వచ్చి, బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా శ్రీసత్య తనదైన ముద్ర వేసుకుంది. తన క్యూట్ అప్పీల్‌తో బిగ్ బాస్ వీక్షకుల మనసుల్ని గెలుచుకుంటూ వచ్చింది.
ఆరో సీజన్ బిగ్ హౌస్‌కి ఓన్లీ గ్లామర్ క్వీన్‌గా శ్రీ సత్య పేరు తెచ్చుకుంది. క్యూట్ అండ్ లవ్లీగా హౌస్‌లో ఇన్ని వారాలు చోటు దక్కించుకుంది శ్రీ సత్య.
పెద్దగా ఎవరితోనూ గొడవల్లేవ్. అప్పుడప్పుడూ కీర్తితోనే చిన్న చిన్న రుసరుసలాడినా, కోపం కాస్సేపే. తర్వాత మళ్లీ గొడవ పెట్టుకున్న వాళ్ల దగ్గరికి వెళ్లి స్వీట్‌గా సారీ చెప్పేస్తుంటుంది శ్రీ సత్య.
Sri Satya Bigg Boss.. ఓన్లీ గ్లామర్.. శ్రీ సత్య స్పెషల్
సోషల్ మీడియాలో శ్రీ సత్యకు బాగా ఫాలోయింగ్ వుంది. హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తూనే పీఆర్ టీమ్స్‌ని బలంగా సిద్దం చేసుకుని వచ్చినట్లుంది. నామినేషన్లలో వున్నప్పటికీ బాగానే సేవ్ అవుతూ వచ్చింది.

మరీ అంత గొప్పగా పర్‌ఫామెన్స్ లేకపోయినా గ్లామర్‌తోనే నెట్టుకొచ్చేసింది. క్లైమాక్స్‌కి చేరిన బిగ్‌బాస్ హౌస్.. కేవలం ఇద్దరే లేడీస్.
ఈసారి ఇద్దరూ మేల్ కంటెస్టెంట్లకే చోటు దక్కేలా వుంది పరిస్థితి చూస్తుంటే. కానీ, బిగ్‌బాస్ ఫార్మేట్‌ని ఫాలో చేయాలని నిర్వాహకులు కోరుకుంటే, లేడీస్ కోటాలో ఛాన్స్ శ్రీ సత్యకే దక్కే అవకాశముంది.
బిగ్ ‘క్వీన్’ శ్రీ సత్య..
కాగా, సోషల్ మీడియా ఫేమ్‌ని బట్టి, బిగ్‌బాస్ క్లైమాక్స్ ఈక్వేషన్స్ మారిపోతుంటాయ్. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు కంటెస్టెంట్లున్నారు. అందులో ఒకరిని మధ్యలోంచే లేపేసేలా వున్నారు.
Also Read: ఉస్తాద్ పవన్ కళ్యాణ్.! మనల్ని ఎవడ్రా ఆపేది.?
మధ్యలో హౌస్ నుంచి బయటికొచ్చేసేది ఎవరో కానీ, శ్రీ సత్య జోష్ మాత్రం నెట్టింట బాగా పెరిగిపోయింది.
నెట్టింట్లో శ్రీ సత్య ఆర్మీ చేస్తున్న సందడికి టాప్ 6 నుంచి టాప్ 2 కి శ్రీసత్య ప్లేస్ ప్రమోట్ అవ్వనుందనే అర్ధమవుతోంది.