Rashmika Mandanna Politics.. ఆయనెవరో జాతకాలు చెబుతాడట.! ఆయనే సమంత – నాగచైతన్య విడిపోతారని జోస్యం చెప్పాడట.!
ఆ మహానుభావుడే ఇప్పుడు కన్నడ కస్తూరి రష్మిక మండన్న గురించీ జోస్యం చెప్పేశాడంట.!
కన్నడ, తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమల్లో రష్మిక మండన్న ఇప్పుడు స్టార్ హీరోయిన్. నేషనల్ క్రష్‌గా మారిపోయింది రష్మిక మండన్న. వయసు తక్కువ.. పాపులారిటీ చాలా చాలా ఎక్కువ.!
సూటిగా సుత్తి లేకుండా.. ఏ విషయాన్ని అయినా కుండబద్దలుగొట్టేయగలదు రష్మిక. అలాంటి రష్మిక రాజకీయాల్లోకి వస్తే.!
ఔను, రష్మిక రాజకీయాల్లోకి వస్తే తప్పేంటి.? కాస్సుపు రష్మిక విషయాన్ని పక్కన పెడదాం.
యంగ్ టైగర్ ఎన్టీయార్ ఏం చెబుతాడంటే..
యంగ్ టైగర్ ఎన్టీయార్, గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. కానీ, ఆయన రాజకీయాలకు దూరం పాటిస్తున్నారిప్పడు.!
నిజానికి యంగ్ టైగర్ ఒప్పుకోవాలేగానీ, టీడీపీ పగ్గాలు ఆయనకి దక్కేస్తాయ్.! అలా వుంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. కానీ, ఎందుకు రాజకీయాల్లోకి రావట్లేదు.?

‘భయ్యా.. రాజకీయాలకు ఇదా సమయం.? బోల్డన్ని సినిమాలున్నాయ్..’ అని ఓ సందర్భంలో యంగ్ టైగర్ అసలు విషయం చెప్పేశాడు.
రాజకీయాల్లోకి అందాల భామలు వెళ్ళడం కొత్తేమీ కాదు. సినిమా హీరోయిన్లు, రాజకీయాల్ని శాసించిన సందర్భాలు చాలానే వున్నాయి. తమిళనాడులో దివంగత జయలలిత సాధించిన రాజకీయ విజయాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
Rashmika Mandanna Politics రష్మిక రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళకూడదు.?
ఇప్పుడు మళ్ళీ రష్మిక మండన్న (Rashmika Mandanna) గురించి మాట్లాడుకుందాం. ఆమె రాజకీయాల్లోకి వస్తుందా.? ఏమో, రావొచ్చేమో.!
కానీ, ఇప్పుడైతే కాదు. ఎవరో జోస్యం చెప్పారని కాదు, ఆమెకు రాజకీయాల్లోకి వెళ్ళాలన్న కోరిక కలిగితే వెళ్ళొచ్చు.. లేకపోతే లేదు.
ప్రముఖ సినీ నటి సుమలత, మరో ప్రముఖ నటి రమ్య.. ఇలా రాజకీయాల్లో రాణించినోళ్ళు కన్నడ నేల మీద నుంచీ చాలామందే వున్నారు.
Also Read: Kangana Ranaut చెప్పే EMERGENCY కథ.. ఏ కోణంలో.!
ఇంతకీ, రష్మిక (Rashmika) ఎప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుంది.? ఆగండహె.. రష్మిక ఈ విషయమై ఆలోచించుకోవాలి కదా.? జోస్యం చెప్పిన స్వామీజీ మాటలు రష్మిక వరకూ చేరాలి కదా.!
‘నేషనల్ క్రష్ రష్మిక మండన్న రాజకీయాల్లోకి రావాలి.. కర్నాటక ముఖ్యమంత్రి అయిపోవాలి.. లేదంటే దేశ ప్రధాని అయిపోవాలి..’ అంటూ సోషల్ మీడియాలో డిమాండ్లూ వచ్చేయాలి.! అప్పుడేమన్నా రష్మిక స్పందిస్తుందేమో.!
రాజకీయం అంటే మరీ అంత వెటకారమైపోయింది మరి.!