Rashmika Mandanna Rainbow.. రష్మిక మండన్న అంటే, బబ్లీ బ్యూటీ.! కాదు కాదు, ‘పుష్ప’ సినిమా కోసం డీ-గ్లామర్ లుక్‌తోనూ మెప్పించింది.!
అంతేనా, బాలీవుడ్‌లో అయితే, అంధురాలిగానూ ‘మిషన్ మజ్ఞు’ సినిమాలో మెప్పించింది రష్మిక మండన్న (Rashmika Mandanna).
ఈసారి ఇంకాస్త భిన్నంగా కనిపించనుంది ‘నేషనల్ క్రష్’ రష్మిక (National Crush Rashmika Mandanna).! ఔను, ‘రెయిన్ బో’ సినిమా కోసం రష్మిక సరికొత్త ‘రంగులు’ అద్దుకోనుంది.!
Rashmika Mandanna Rainbow.. ఇంద్ర ధనస్సు.. ఇది వేరే లెవల్.!
‘రెయిన్ బో’.. టైటిల్‌లోనే వుంది అసలు సిసలు కిక్కు. ఇదో లేడీ ఓరియెంటెడ్ మూవీ. రష్మిక పాత్ర చాలా కొత్తగా, డిఫరెంట్ షేడ్స్‌లో వుండబోతోందట.
రొమాంటిక్ ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నటించడం తనకెంతో సంతోషంగా వుందని రష్మిక మండన్నా చెబుతోంది. మొదటిసారి లేడీ సెంట్రిక్ పర్‌ఫామెన్స్ ఎక్స్ పీరియన్స్ చేస్తున్నానంటూ మురిసిపోతోంది.

తెలుగుతో పాటూ తమిళ, మలయాళ, కన్నడ తదితర భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. అంటే, పాన్ ఇండియా బొమ్మ లెక్క అన్నమాట.!
గతంలో కార్తి హీరోగా వచ్చిన సూపర్ హిట్ సినిమాలు ‘ఖాకీ’, ‘ఖైదీ’, ‘సుల్తాన్’ సినిమాల్ని నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది.
రష్మిక మళ్లీ బిజీ బిజీ..
కొత్త దర్శకుడు శాంతరూబన్ ఈ సినిమాతో పరిచయమవుతున్నాడు. మలయాళ నటుడు దేవ్ మోహన్ మెయిన్ లీడ్ పోషిస్తున్నాడు.
Also Read: నిజాయితీగా వున్నా విడాకులొచ్చాయ్: సమంత వైరల్ కామెంట్స్
తాజాగా స్టార్ట్ అయిన ఈ సినిమా రెగ్యులర్ షూట్ మరో వారం రోజుల్లో మొదలు కానుంది. కాగా, ప్రస్తుతం రష్మిక మండన్నా తెలుగులో ‘పుష్ప 2’ సినిమాతోనూ, హిందీలో ‘యానిమల్’ సినిమాతోనూ బిజీగా గడుపుతోంది.
అన్నట్టు, గతంలో సమంత ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతుందనే ప్రకటన వచ్చింది. 2021లోనే ఈ సినిమా ప్రారంభమవ్వాల్సి వుంది.
అయితే, అనివార్య కారణాల వల్ల సమంత నుంచి ఆ ప్రాజెక్ట్ రష్మిక మండన్న చేతిలో వచ్చి పడింది. నిజానికి, ఇదొక ఛాలెంజింగ్ కథాంశమట.
లేడీ సూపర్ స్టార్ అవ్వాలంటే.. ఈ తరమా ఛాలెంజింగ్ రోల్స్ రష్మిక చేయాల్సిందే.!
