Rashmika Mandanna Serious Warning.. గతం వేరు.. ప్రస్తుతం వేరు.! ఒకప్పటిలా మౌనంగా కూర్చునే పరిస్థితి లేదు. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.!
ఇదీ, సినీ నటి రష్మిక మండన్న సోషల్ మీడియా వేదికగా ఇచ్చిన సీరియస్ వార్నింగ్.! ఇటీవల విజయ్ దేవరకొండని రష్మిక మండన్న పెళ్ళాడిన సంగతి తెలిసిందే.
గతంలో రష్మికకి ఎంగేజ్మెంట్ జరిగింది.. ఆమె తెలుగు సినిమాల్లోకి రాకముందు వ్యవహారమది. ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది కూడా.!
అయినాసరే, ఆ పాత గాయాన్ని ప్రస్తావిస్తూ, రష్మికని కొందరు సోషల్ మీడియా వేదికగా ఇబ్బంది పెడుతూనే వున్నారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ సతీమణి రష్మిక మండన్న. ఈ క్రమంలో, రష్మిక సీరియస్ యాక్షన్‌కి సిద్ధమైంది.. ట్రోలింగ్ చేస్తున్నవారిపై.
Rashmika Mandanna Serious Warning.. ఇరవై నాలుగ్గంటలే డెడ్ లైన్..
‘ఇరవై నాలుగ్గంటల్లోగా ఆ వీడియోల్ని తొలగించకపోతే, చట్టపరమైన చర్యలు తప్పవు..’ అని రష్మిక హెచ్చరించింది. ఇంతకీ, ఆ వీడియోలో ఏముంది.?
రష్మికకి గతంలో జరిగిన ఎంగేజ్మెంట్ రద్దవడానికి సంబంధించిన వీడియోల్ని కొందరు, ట్రోలింగ్ కంటెంట్‌గా మార్చారు.. ఆ కంటెంట్ మీదనే రష్మిక అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
ఎనిమిదేళ్ళ క్రితం నాటి ఫ్యాబ్రికేటెడ్ వీడియోల నుంచి కొంత భాగాన్ని తీసి, ఇప్పుడు తనను వేధిస్తున్నారంటూ, రష్మిక మండన్న ఆరోపిస్తోంది.
Also Read: నాకింకా పెళ్ళి కాలేదు.! ఆ వేధింపులు ఆపండి.!
ఇరవై నాలుగ్గంటల డెడ్‌లైన్ పెట్టిన దరిమిలా, రష్మిక హెచ్చరికలకు ఎంతమంది భయపడతారో వేచి చూడాలి.
సోషల్ మీడియా హ్యాండిల్స్ నడుపుతున్నవారు, యూ ట్యూబ్ ఛానల్స్ నిర్వహిస్తున్నవారు.. అందరికీ రష్మిక సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
ప్రధానంగా గతంలో రష్మికతో ఎంగేజ్మెంట్ జరిగిన కన్నడ సినీ ప్రముఖుడు రక్షిత్ శెట్టి అభిమానులే, ఆమెను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.
