Rathika Rose BB Telugu.. అవును.. ఎవరీ రతిక రోజ్.! అనూహ్యంగా బిగ్ బాస్ రియాల్టీ షోలోకి ఎంట్రీ ఇచ్చింది.. అప్పుడే, హాట్ సెన్సేషన్ అయిపోయింది.!
మోడలింగ్ రంగం నుంచి యాక్టింగ్‌లోకి వచ్చింది. అప్పుడెప్పుడో ‘బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.
షకలక శంకర్ హీరోగా తెరకెక్కిన చిత్రమిది. పెద్దగా గుర్తింపు దక్కలేదీ సినిమాతో రతికా రోజ్‌కి. ఇటీవల బెల్లంకొండ గణేష్ హీరోగా వచ్చిన ‘నేను స్టూడెంట్ సర్’ సినిమాలో ఓ స్టన్నింగ్ రోల్‌లో కనిపించింది.
Rathika Rose BB Telugu.. సీరియస్ బ్యూటిఫుల్ పోలీస్..
అదే పోలీసాఫీసర్ పాత్ర. ఈ రోల్‌లో సీరియస్‌గా కనిపిస్తూనే అందంగా స్పెషల్ ఎంట్రీ ఇచ్చింది రతిక రోజ్ (Rathika Rose). ఈ పాత్రతోనే ఎవరీ ముద్దుగుమ్మ అని అంతా అవాక్కయ్యారు.
అయితే, అది జస్ట్ చిన్న రోల్ మాత్రమే. ఇప్పుడు ఈ అందాల గులాబీ బుల్లితెరపై సందడి చేస్తోంది బిగ్‌బాస్ (BiggBoss Telugu7) షో ద్వారా. రీసెంట్‌గా స్టార్ట్ అయిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7లో రతిక ఓ పార్టిసిపెంట్‌గా హౌస్‌లో అడుగు పెట్టింది.

ఎంట్రీ అదిరింది. ప్రెజెన్స్ బాగుంది. మల్టీ టాలెంటెడ్ అని హోస్ట్ నాగార్జున రతికను ప్రేక్షకులకు పరిచయం చేశారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్.. హీరోయిన్.. అని ఇంట్రడ్యూస్ చేశారు.
అవును నిజమే, సోషల్ మీడియాలో రతికకు బోలెడంత ఫాలోయింగ్ వుంది. బిగ్‌బాస్ (BiggBoss Telugu7) కంటెస్టెంట్‌గానూ అప్పుడే ట్రెండింగ్‌లోకి వచ్చేసిందీ అందాల గులాబీ.
Also Read: Bigg Boss Telugu Shakila.. ఈమె ఎందుకొచ్చింది.?
బిగ్‌బాస్ హౌస్‌లో తనదైన పర్‌ఫామెన్స్‌తో రతికా రోజ్ ఇకపై ఎలాంటి గుర్తింపు దక్కించుకుంటుందో.! దానికి తోడు ఇప్పటికే వున్న ఫాలోయింగ్ యూజ్ చేసుకుని బిగ్‌బాస్ కిరీటాన్ని దక్కించుకోగలదో లేదో.. చూడాలి మరి.!
అన్నట్టు, ఈ సీజన్‌కి సంబంధించి ఒకింత ప్రామిసింగ్ కంటెస్టెంట్.. అనే ప్రచారమైతే సోషల్ మీడియాలో రతికా రోజ్ గురించి జరుగుతోంది.