Raveena Tandon ఏం సెప్తిరి.! ఏం సెప్తిరి.? హీరోయిన్గా ఎప్పుడూ అసభ్యతకు తావివ్వలేదట.! రేప్ సీన్స్‌లో కూడా అసభ్యంగా కనిపించలేదట.!
థండర్ థైస్ చూపించినందుకుగానూ.. థండర్ క్వీన్ అని పిలిచేవారట.! బాలయ్యతో ‘బంగారు బుల్లోడు’ సినిమాలో ఒలకబోసింది అసభ్యత కాకపోతే గ్లామరా.?
వృద్ధ నారీ పతివ్రతః అని వెనకటికి ఓ సామెత ఊరికే పుట్టలేదు మరి.!
Raveena Tandon.. అబ్బే.! ముద్దంటే కూడా చేదంటూ..!
బాలకృష్ణ హీరోగా ‘బంగారు బుల్లోడు’ సినిమాలో నటించిన హీరోయిన్ గుర్తుందా.? ఓ వాన పాటలో అమ్మడు ఒలకబోసిన వయ్యారాలు గుర్తున్నాయా.?
ఆ అమ్మడే రవీనా టాండన్. అబ్బెబ్బే.! నేనెప్పుడూ లిప్‌లాక్స్ చేయలేదు.. నేనెప్పుడూ వల్గర్‌గా నటించలేదు.. అంటూ తాజాగా ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది ఈ హాట్ బ్యూటీ.

ఆ మాటకొస్తే, రవీనాటాండన్ గత సినిమాల హిస్టరీ ఒక్కసారి తిరగేస్తే తెలిసిపోతుంది. ఇప్పుడర్ధమైందా.? వృద్ధనారీ పతివ్రత.. అని ఎందుకనాల్సి వచ్చిందో.!
అందుకే ఆ ఛాన్స్ వదులుకున్నా..
అస్సలు ఎక్స్‌పోజింగ్‌కి తావివ్వలేదట. అంతెందుకు రేప్ సీన్స్‌లో కూడా ఎక్కడా అసభ్యతకు చోటివ్వలేదట ఈ అందాల భామ.
ఆ మాటకొస్తే, డ్రస్‌పై ఒక్క చిరుగు కూడా లేకుండా రేప్ సీన్లో నటించిన ఒకే ఒక్క హీరోయిన్ నేనేనంటోంది. లిప్‌లాక్ సన్నివేశాలనున్నాయనీ కొన్ని సూపర్ హిట్ సినిమాలు వదిలేసుకున్నానని చెప్పుకొచ్చింది
అలాగే, హీరో హీరోయిన్ల మధ్య అభ్యంతరకరమైన సన్నివేశాలుంటే నటించనని దర్శక, నిర్మాతలకు చెప్పేసేదట. అలా చాలా అవకాశాలు వదులుకోవల్సి వచ్చిందని పాత విషయాలు గుర్తు చేసుకుంది.
Also Read: అనుపమకి ప్రమోషన్.! రిస్క్ చేస్తోందా.? లక్కు కలిసొచ్చిందా.?
కెరీర్ మొదట్లో బాడీ షేమింగ్ ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నాననీ తెలిపింది. తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా, బాలయ్యతో చేసిన ‘బంగారు బుల్లోడు’ మంచి గుర్తింపు తెచ్చింది.

‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమాతో తెలుగులో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇటీవల ‘కేజీఎఫ్ 2’ లో ప్రధాన మంత్రి పాత్ర పోషించి మరింత క్రేజ్ దక్కించుకుంది రవీనా టాండన్.