Ravi Teja Irumudi.. మాస్ మహరాజ్ అనే ప్రచారం చేసుకుంటాడుగానీ, రవితేజకి క్లాస్ అయినా మాస్ అయినా.. ఎలాంటి క్యారెక్టర్ అయినా, సరిగ్గా పడితే అదిరిపోతుందంతే.!
రవితేజ గురించి చెప్పుకోవాలంటే, విలక్షణ నటుడు.. అనడం సబబు.! కానీ, ఎందుకో.. మాస్ రొట్ట కొట్టుడుకి పరిమితమైపోతున్నాడు రవితేజ.
సరిగ్గా ఈ టైమ్‌లోనే రవితేజ నుంచి ‘ఇరుముడి’ సినిమాకి సంబంధించిన ప్రకటన వచ్చింది. ఓ చిన్నమ్మాయి, ఆ అమ్మాయితోపాటు రవితేజ.. ఇద్దరూ అయ్యప్ప స్వామి మాలధారణలో కనిపిస్తున్నారు.
శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ విడుదల చేశారు.
Ravi Teja Irumudi.. ‘దొంగోడు’ సినిమా గుర్తుకొచ్చింది..
‘ఇరుముడి’ పోస్టర్ చూడగానే, రవితేజ అభిమానులకి ‘దొంగోడు’ సినిమా గుర్తుకొచ్చింది. అందులో, అయ్యప్పస్వామి మాల ధారణలో కాస్సేపు కనిపిస్తాడు రవితేజ.
ఇంతకీ, ‘ఇరుముడి’ భక్తి ప్రధాన చిత్రమా.? అంటే, కాకపోవచ్చు.. రొటీన్ మాస్ రొట్ట కొట్టుడేనేమో.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి, శివ నిర్వాణ అంటే.. సెన్సిబుల్ సినిమాల్ని తెరకెక్కించే దర్శకుడు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ తదితర సినిమాలు శివ నిర్వాణ నుంచి వచ్చాయ్.
Also Read: నాకింకా పెళ్ళి కాలేదు.! ఆ వేధింపులు ఆపండి.!
‘టక్ జగదీష్’, ‘ఖుషీ’ సినిమాలు కూడా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చినవే. ‘ఇరుముడి’ సినిమాతో, శివ నిర్వాణ తిరిగి తన పాత ఫామ్ కొనసాగిస్తాడని అంతా అనుకోవడంలో వింతేముంది.?
వదిలిన పోస్టర్ అలాంటిది మరి.! మాస్ ఎలిమెంట్స్ వుండటం తప్పు కాదు. కానీ, రవితేజ.. ఆ రొట్ట కొట్టుడుకి దూరంగా వుంటే మంచిది.! శివ నిర్వాణ వుంచుతాడా.? అన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్.
ఏమో, రవితేజ పొటెన్షియాలిటీని సరిగ్గా శివ నిర్వాణ ప్రెజెంట్ చేయగలిగితే, రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ‘ఇరుముడి’ నిలిచిపోవచ్చు.!
