Table of Contents
రవిచంద్రన్ అశ్విన్.. (Ravichandran Ashwin Perfect All Rounder) భారత క్రికెట్‌కి సంబంధించి అనిల్ కుంబ్లే తర్వాత ఆ స్థాయిలో భారత క్రికెట్ అభిమానులు ఎక్కువగా మాట్లాడుకునే స్పిన్నర్ ఇతడేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదేమో. బంతితోపాటు, అవసరమైతే బ్యాట్‌తోనూ టీమిండియాకి విజయాలు అందించగల దిట్ట కావడమే ఇందుకు ప్రత్యేకమైన కారణం.
మైదానంలోకి దిగాక, బౌలింగ్ చేయాల్సిన పిచ్ గురించి అనిల్ కుంబ్లేలానే స్డీ చేస్తుంటాడు అశ్విన్ (Ravichandran Ashwin Perfect All Rounder). బంతిని ఎప్పుడు నెమ్మదిగా సంధించాలి.? ఎప్పుడు వేగంగా తిప్పాలి.? వంటి అంశాలపై కుంబ్లేలానే అశ్విన్ ఆలోచిస్తుంటాడు, ప్రయోగాలు చేస్తుంటాడు కూడా.
అశ్విన్ అందుకే అంత స్పెషల్..
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ సందర్భంగా అశ్విన్ పేరు మరోమారు గట్టిగా మార్మోగిపోతోంది. అందుక్కారణం తాజాగా అశ్విన్ సాధించిన సెంచరీ మాత్రమే కాదు, అతను సాధిస్తున్న వికెట్లు కూడా.
తాను బంతుల్ని తెలివిగా విసరడం మాత్రమే కాదు, ఫీల్డింగ్ సెట్ చేసే విషయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీతో వ్యూహాత్మక చర్చలు, తోటి బౌలర్లకు సలహాలిస్తూ, వారి నుంచీ సలహాలు తీసుకుంటూ ముందుకు వెళుతుండడం.. ఇలా అశ్విన్ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.
రోహిత్, పుజారా, రహానే వంటి మేటి బ్యాట్స్‌మెన్, ఇంగ్లాండ్ బౌలర్లకు అడ్డంగా దొరికేస్తే, అనిల్ కుంబ్లే మాత్రం.. ఎలాంటి బెరుకూ లేకుండా టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్‌లా సత్తా చాటాడు. నిజానికి, అశ్విన్ క్రికెట్‌లో తొలుత బ్యాట్స్‌మెన్ అవుదామనే అనుకున్నాడు.
అశ్విన్.. అదీ అసలు సీక్రెట్.. Ravichandran Ashwin Perfect All Rounder
కానీ, అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. మొదట్లో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అయిన అశ్విన్ (జాతీయ స్థాయి క్రికెట్ కాదు లెండి.. అంతకు ముందు), ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్ అవతారమెత్తాడు. చివరికి స్పిన్నర్‌గా స్థిరపడ్డాడు.
ఒకప్పటి తన బ్యాటింగ్ నైపుణ్యానికి ఎప్పటికప్పుడు పదును పెడుతూనే, అవసరమైనప్పుడు జట్టుకి తన బ్యాటు ద్వారా పరుగులు తెచ్చిపెడుతున్నాడీ మేటి స్పిన్నర్. ‘ఆల్ రౌండర్’ అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంలా అశ్విన్ మారిపోయాడంటూ.. అశ్విన్ మీద ఇప్పుడు పొగడ్తల వర్షం కురుస్తోంది.
జట్టు తర్వాతే ఏదైనా..
‘ఏం చేసినా అది జట్టు కోసమే.. ఒక్కోసారి ఫెయిల్యూర్స్ బాధిస్తుంటాయి.. మనది కాని రోజున మనం ఎన్ని వ్యూహాలు రచించినా అవి పనిచేయవు.. అప్పుడే కొత్త పాఠాలు నేర్చుకుంటాం.. ఇంకా మెరుగ్గా రాణించడానికి కష్టపడతాం..’ అంటాడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin Perfect All Rounder).