Aadarsha Kutumbam Trivikram Venky.. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా విడుదలకు సిద్ధమైంది.. సినిమాపై, పుకార్ల జోరు కొనసాగుతూనే వుంది.
సినిమా ఆగిపోయిందన్నారు.. రీ-షూట్లని అన్నారు.! వచ్చే ఏడాది సినిమా విడుదలవుతుందన్నారు. కానీ, ఆ పుకార్లన్నీ హంబక్.. సినిమా రిలీజ్ డేట్ కన్ఫామ్ అయిపోయింది.
పబ్లిసిటీ కూడా జోరుగా సాగుతోంది. అయినా, పుకార్లు కొనసాగుతూనే వున్నాయ్. ఈ సినిమా ఫలానా సినిమాకి కాపీ.. అంటూ జరుగుతున్న ప్రచారం, అలా కొనసాగుతూనే వుంది మరి.!
మొన్నీమధ్యనే ఓ సినిమా వచ్చింది. అదొక యాక్షన్ ఎంటర్టైనర్. ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం యాక్షన్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. ఓటీీలో ఘన విజయం సాధించింది ఆ సినిమా.
థియేట్రికల్ రిలీజ్ జస్ట్ ఓకే అంతే.! ఆ సినిమాతో, ‘ఆదర్శ కుటుంబం’ సినిమాని పోల్చుతున్నారు. ఇది అదేనా.? అంటూ, ఆ సస్పెన్స్ ఇంకా అలానే వుంది.
‘ఆదర్శ కుటుంబం’ సినిమా ప్రోమోస్ చూస్తే, ఎక్కడా ‘ఆ సినిమా తాలూకు ఛాయలు’ కనిపించడంలేదు. అంతలా జాగ్రత్త పడ్డారా.? ఆ కథ వేరు, ఈ కథ వేరా.?
త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకి మొదటి నుంచీ ‘కాపీ’ విమర్శలెక్కువ. ఏ సినిమా తీసుకున్నా, ఫలానా సినిమా రిఫరెన్స్ ఖచ్చితంగా కనిపిస్తుంటుంది.
అయినాగానీ, హిట్లు మీద హిట్లు కొడుతూనే వుంటాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ కోవలోనే, ‘ఆదర్శ కుటుంబం’పై వచ్చిన విమరశ్శలకు అతీతంగా, సినిమా హిట్టవుతుందా.?
అన్నట్టు, ఈ సినిమా విజయం అందరికన్నా ఎక్కువగా హీరోయిన్ శ్రీనిధి శెట్టికి అవసరం.! ‘కేజీఎఫ్’ తర్వాత, శ్రీనిధి శెట్టికి అవకాశాలొస్తున్నా, హిట్లు మాత్రం రావట్లేదాయె.
శ్రీనిధి శెట్టిని ప్రస్తుతానికి చాలా పద్ధతిగా చూస్తున్నాం ‘ఆదర్శ కుటుంబం’ ప్రోమోస్‌లో.! కానీ, ఆమెలో బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్స్ చేసేసే, ‘లేడీ డాన్’ వుందా.? అన్నదే డౌట్.
