Reason Behind Acharya Failure.. సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలిస్తే, సినిమా రంగంలో అసలు ఫెయిల్యూర్స్ అనేవే రావు. హిట్టు సినిమాలూ, ఫ్లాప్ సినిమాలూ అది వేరే కథ. ఇదేం సినిమా మహా ప్రభో.! అని బుర్ర బాదుకునే పరిస్థితి రావడం కాస్త ఆశ్చర్యకరమైనదే.
‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Rama) సినిమా చూశాకా, చాలా మంది మదిలో మెదిలిన ప్రశ్న.. బోయపాటి ఇలా ఎందుకు చేశాడు.? అని. మళ్లీ అలాంటి చర్చ ‘ఆచార్య’ సినిమా విషయంలో కొరటాలపై జరుగుతోంది.
ఇంత పెద్ద తప్పు ఎలా జరిగింది.? 150కి పైగా సినిమాలు చేసిన హీరో, కొరటాల శివని(Koratala Siva) అంత గుడ్డిగా ఎలా నమ్మేశాడు.?
ఫైనల్ అవుట్ పుట్ చూసుకున్నాకా కూడా చిరంజీవి (Mega Star Chiranjeevi) డ్యామేజ్ కంట్రోల్ చర్యలు ఎందుకు చేపట్టలేకపోయాడు.?
Reason Behind Acharya failure.. ఎందుకిలా.?
‘వినయ విధేయ రామ’ సినిమా విషయంలో జరిగిన తప్పు రిపీట్ అవ్వకుండా, చరణ్ (Mega Power Star Ram Charan) ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేకపోయాడు.? ప్రశ్నలైతే వున్నాయ్. సమాధానాలే దొరకడం లేదు.
అప్పుడు బోయపాటి.. (Boyapati Srinu) ఇప్పుడు కొరటాల.. (Koratala Siva) ఇద్దరూ ఓ పద్ధతి ప్రకారం ముంచేశారా.? అనే చర్చ జరగడం ఆశ్చర్యకరమే.
ఈ రెండు సినిమాల్లో కొన్ని సన్నివేశాలయితే, ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది.? అని సినిమా మీద అవగాహన లేని వాళ్లకి కూడా అనిపిస్తుంది.
అటు బోయపాటి కావచ్చు.. ఇటు కొరటాల కావచ్చు.. కావాలనే ఇలా చేశారని అనుకోలేం. కానీ, అతి విశ్వాసం కొంప ముంచేసింది.
వెనక్కి తిరిగి చూసుకుంటే, దర్శకుల కెరీర్‌లోనూ, హీరోల కెరీర్‌లోనూ ఇవి బ్లాక్ మార్క్స్. చెరిపేసుకుంటే చెరిగిపోయేవి కాదు.
నిజానికి ‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Rama) విషయంలో అయినా, ‘ఆచార్య’ (Acharya Movie) విషయంలో అయినా కెరీర్ బెస్ట్ అవకాశాల్ని ఆయా దర్శకులు వాటిని చేజేతులా చెడగొట్టుకున్నారు. విశ్వసనీయతను కోల్పోయారు.
ఈ కులం గోలేంటి చెప్మా.?
ఇదిలా వుంటే, సందట్లో సడేమియా అన్నట్టు.. ’ఆచార్య‘, ’వినయ విధేయ రామ‘ సినిమాల ఫెయిల్యూర్ ఎపిసోడ్లోకి ’కులం కార్డు‘ తెరపైకి తెస్తున్నారు కొందరు.
ఇంకా ఈ రోజుల్లో కూడా కులం పేరుతో ఈ రచ్చ ఏంటి.? అంటే, అదంతే.. అన్నీ వుంటాయ్.! కాదేదీ వివాదానికి అనర్హం.
ఒక్కటి మాత్రం నిజం.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ‘ఆచార్య’ ఫెయిల్యూర్ విషయమై పోస్టుమార్టమ్ నిర్వహించాలి.. ఆత్మపరిశీలన చేసుకోవాలి.
ఎందుకంటే, కోట్లాది మంది అభిమానుల ఆశలు ఆవిరైపోయాయ్ ‘ఆచార్య’ సినిమాతో. అత్యద్భుతమైన కాంబినేషన్ ఇది. పైగా, ‘సురేఖ కోరిక వల్లే ఈ సినిమా రూపొందింది..’ అని చిరంజీవి పదే పదే చెబుతూ వచ్చారు.
Also Read: ‘ఆచార్య’ చిరంజీవి చూడని హైప్, సక్సెస్ వుంటాయా.?
కొన్ని కొన్నిసార్లు అనుకున్నవి అనుకున్నట్లుగా వర్కవుట్ అవకపోవడం మామూలే. కానీ, అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా.. అందునా, చిరంజీవి – చరణ్ కాంబినేషన్.. సో, ‘ఆచార్య’ ఫెయిల్యూర్ ఖచ్చితంగా గుణపాఠమే.
‘వినయ విధేయ రామ’ తర్వాత కూడా చరణ్, ‘నేర్చుకోలేదు’ అంటే, జీర్ణించుకోవడం అభిమానులకు కష్టంగానే వుంది మరి. దర్శకుడు కొరటాల శివ, బోయపాటి శ్రీను సైతం.. ఇలాంటి తప్పిదాల్ని రీపీట్ చేయరనే ఆశిద్దాం.
