ఒకే ఒక్క డైలాగ్.. ‘రిపబ్లిక్’ సినిమా (Republic Sai Dharam Tej) గురించి పూర్తిగా చెప్పేసిందా.? ఏమోగానీ, రాజకీయం గురించి అయితే పక్కాగా, చాలా స్పష్టతతో చెప్పినట్లుంది. విలక్షణ చిత్రాల దర్శకుడు దేవ కట్టా (Deva Katta), తన ప్రతి సినిమాతోనూ చక్కని సందేశాన్ని ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు.
సాయి ధరమ్ తేజ్ (Supreme Hero Sai Dharam Tej) హీరోగా నటించిన ‘రిపబ్లిక్’ (Republic Film) సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో ‘రిపబ్లిక్’ (Republic Movie) టీమ్ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది. మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ఈ ట్రైలర్ విడుదల చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్, తన కారణంగా సినిమా విడుదల ఆలస్యం కాకూడదని కోరాడట.
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడనీ, త్వరలోనే క్షేమంగా మనందరి ముందుకూ వస్తాడనీ మెగా కుటుంబం చెబుతోంది.
ఇక, ‘రిపబ్లిక్’ సినిమా విషయానికొస్తే, జగపతిబాబు, రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రంలో ఇతర ప్రధాన తారాగణం. రమ్యకృష్ణ నెగెటివ్ రోల్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. రాజకీయ వ్యవస్థకీ, బ్యూరోక్రసీకి మధ్య జరిగే పోరాటంగా ఈ ‘రిపబ్లిక్’ సినిమా వుండబోతోంది.
సినిమా సంగతి పక్కన పెడితే, ప్రస్తుత రాజకీయ వ్యవస్థ.. పూర్తిగా బ్యూరోక్రసీని తన గుప్పిట్లో పెట్టుకుందన్నది బహిరంగ రహస్యమే. ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారుల్లో చాలామంది, అధికారంలో వున్నవారి కోసం పనిచేస్తున్నారనీ, వారి మెప్పు కోసమే నిబంధనల్ని సైతం తుంగలోకి తొక్కేస్తున్నారన్న విమర్శలున్నాయి. రాజకీయమనే మోసం, అజ్ఞానమనే గూట్లో గుడ్లు పెడితే నష్టపోయే సమాజం.. ఎలా స్పందిస్తుంది.?
ఇంతకీ, ‘రిపబ్లిక్’ సినిమా (Republic Sai Dharam Tej) సోకాల్డ్ పొలిటీషియన్స్.. సోకాల్డ్ బ్యూరోక్రసీ పెద్దల మనోభావాల్ని దెబ్బతీసేలా వుంటుందా.? ఈ సినిమాతో వ్యవస్థలో చైతన్యం వస్తుందా.? వేచి చూడాల్సిందే.