Husband Deadly Escape.. అక్రమ సంబంధాలు.! ఇటీవలి కాలంలో, ఇవి చాలా చాలా ఎక్కువైపోయాయ్.!
పెళ్ళి చేసుకున్నాక, భర్త అంటే ఇష్టం లేని భార్య, ప్రియుడితో లేచిపోవడం.. అనే అంశం చుట్టూ బోల్డన్ని కథలు.. వింటున్నాం, భయానకమైన వార్తల్ని చూస్తున్నాం.
సేమ్ టు సేమ్, అక్రమ సంబంధం పెట్టుకుని, భార్యని అంతం చేసిన భర్తల గురించీ వింటున్నాం.. చూస్తున్నాం.!
ఉత్తర ప్రదేశ్‌లో ఓ భర్త, ప్రాణ భయంతో తన భార్యని, ఆమె ప్రియుడికిచ్చి పెళ్ళి చేసేశాడు.. అలా, ఆ భర్త తన ప్రాణాల్ని కాపాడుకున్నాడు.
Husband Deadly Escape.. బబ్లూ తెలివైనోడు..
అంతలా ఆ భర్త బబ్లూ భయపడటానికి బలమైన కారణమూ లేకపోలేదు. అదే, ఉత్తర ప్రదేశ్‌లో ఓ భార్య, తన ప్రియుడితో కలిసి, భర్తని అతి కిరాతకంగా చంపేసిన వార్తని చూశాడు బబ్లూ.
ముక్కలు ముక్కలుగా నరికివేయబడ్డ ఆ భర్త పరిస్థితి తనకు రాకూడదని, బబ్లూ అనే వ్యక్తి జాగ్రత్త పడ్డాడు. తన భార్య రాధికని, ఆమె ప్రియుడి గురించి అడిగాడు.
చంపేయడం ఫ్యాషన్ అయిపోయింది ఇటీవలి కాలంలో.! భర్త నచ్చకపోతే, నచ్చినోడితో లేచిపోవచ్చు.! భార్య నచ్చకపోతే, ప్రియురాలితో జంప్ అయిపోవచ్చు.! కానీ, ఈ చంపేసుకోవడాలేంటో.!
Mudra369
ఎట్టి పరిస్థితుల్లోనూ తన ప్రియుడ్ని వదులుకునే ప్రసక్తే లేదని, రాధిక చెప్పడంతే, ప్రియుడు విశాల్ కుమార్‌తో తన భార్య రాధికకి పెళ్ళి చేయించాడు రాధిక భర్త బబ్లూ.!
2017లో బబ్లూ – రాధిక పెళ్ళి చేసుకోగా, ఈ జంటకి ఇద్దరు పిల్లలున్నారు. రాధికకి, విశాల్ కుమార్‌తో పెళ్ళి చేసిన రాధిక భర్త బబ్లూ, తమ ఇద్దరి పిల్లల్ని మాత్రం తానే చూసుకోవాలని నిర్ణయించుకున్నాడట.
పక్కా ప్లానింగ్..
ముందు ముందు ఎలాంటి సమస్యలూ రాకుండా, పెద్దల సమక్షంలోనే ఈ పెళ్ళి జరిపించాడు బబ్లూ. అంతే కాదు, అవసరమైన ఒప్పంద పత్రాల మీద ముగ్గురూ సంతకాలు కూడా చేశారట.
సినిమాల ప్రభావమో, ఓటీటీ వెబ్ సిరీస్‌ల ప్రభావమోగానీ.. మనిషిని, మనిషి చంపేసుకోవడం తేలికైపోయింది. మరీ, ముఖ్యంగా అక్రమ సంబంధాల కేసుల్లో హత్యలు.. మరీ దారుణం.
Also Read: సింగిల్ సింహం.! ఎంత నిజం.?
పెళ్ళయిన రోజే, భర్తని చంపేసిన భార్య.! భార్యను చంపేసిన భర్త.! భార్య, తన ప్రియుడితో కలిసి భర్తని చంపేయడం. భర్త, తన ప్రియురాలితో కలిసి భార్యను చంపేయడం.! ఇవన్నీ చూస్తున్నాం.
పెళ్ళంటే, చావడం కోసమే.. అన్నట్లు తయారైంది పరిస్థితి. ఈ నేపథ్యంలో, చావు భయంతో తన భర్తకి, ఆమె ప్రియుడితో పెళ్ళి చేయించిన భర్తని అభినందించి తీరాల్సిందే.
లోకం తీరు.. ఇలా తగలడింది మరి.!