Table of Contents
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ఇది నిజానికి సినిమా (Lakshmi’s NTR Preview) కాదు. జీవితం. స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించినప్పటి నుండీ భౌతికంగా స్వర్గీయ ఎన్టీఆర్ అంతర్ధానం చెందినంత వరకూ జరిగిన చరిత్ర.
స్వర్గీయ నందమూరి తారక రామారావు అంటే తెలుగు వారికి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. అసలు ఆయన గురించి ఎవరైనా ఎంత గొప్పగా అయినా చెప్పాలని ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం చాలా చిన్నదవుతుంది. ఎందుకంటే ఆ మహనీయుడి జీవిత చరిత్ర అలాంటిది.
Telugu cinema paristrama ki sambandhinchinanthavaraku, NTR peru lekunda charitranu modalupettalem, muginchalem. Telugu nata rajakeeyala gurinchi matladalanna sare, NTR peru khachitamga prasthavinchi theeralsinde. lekapote adi cinema charitra ayina rajakeeya charitra ayina asampoorname.
ఇదీ నిజం.. (Lakshmi’s NTR Preview)
దురదృష్టవశాత్తూ ఆ మహనీయుడి జీవిత చరిత్ర పేరుతో కొంత భాగానికి పరిమితమైపోయి, ఎన్టీఆర్ బయోపిక్‌ని తెరకెక్కించాడు దర్శకుడు క్రిష్. దురదృష్టవశాత్తూ అని ఎందుకనాల్సి వస్తోందంటే అది అసంపూర్ణ చరిత్ర కాబట్టి.
ఇదీ అసలు కథ అంటూ ఎన్టీఆర్ జీవితంలోని అత్యంత బాధాకరమైన రోజుల్నీ, ఆ రోజుల్లో జరిగిన సంఘటనల్నీ ఈ తరం ప్రేక్షకుల ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma).
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర తెరిచిన పుస్తకం. ఎప్పుడు పుట్టారు.? ఎలా సినిమాల్లోకి వచ్చారు.? రాజకీయాల్లో ఏం సాధించారు.? చివరికి ఏం పోగొట్టుకున్నారు.? అన్నీ అందరికీ తెలుసు. దాదాపుగా ప్రతీ అణువూ అందరికీ తెలిసిందే.
ఎన్టీఆర్ జీవితాన్ని మార్చేసిన ఆమె..
కొత్తగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ (Lakshmi’s NTR) అంటూ వర్మ చెప్పడానికేముంది.? చూపించడానికేముంది.? కొత్తదనం ఆశించలేం కానీ, తెలిసీ తెలియని కొన్ని సన్నివేశాల్ని మాత్రం ఈ సినిమాలో చూసేందుకు అవకాశముంది.
లక్ష్మీపార్వతి (Lakshmi Parvathi), ఎన్టీఆర్ (Sr NTR) జీవితంలోకి వచ్చిన తర్వాత అన్నగారి కుటుంబంలో తలెత్తిన గొడవలు, తెలుగుదేశం పార్టీలో పుట్టుకొచ్చిన తగాదాలు.. అన్నింటికీ మించి రాజకీయంగా ఒంటరై తీవ్ర మానసిక క్షోభ అనుభవించి, ఆ క్షోభతోనే ఎన్టీఆర్ ప్రాణాల్ని కోల్పోయిన వైనం. ఇదంతా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో చూడబోతున్నాం.
తెలిసినవీ, తెలియనివీ…
నిజానికి ఇందులో చాలా వరకూ మనకి తెలిసిన విషయాలే ఉంటాయి. స్వయంగా ఆ తారకరాముడే తనకు జరిగిన అవమానాలు, తాను ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నింటికీ మించి వెన్నుపోటుకు తానెలా బలైపోయిందీ చెప్పిన వైనం ఇప్పటికీ మన కళ్ల ముందు కదలాడుతుంది.
ఎన్నికల ముందర కాకతాళీయంగానే ఈ సినిమా హడావిడి మొదలైందా.? అంటే కాదని మాత్రం సమాధానం చెప్పలేం.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) నిర్మాత ఈ చిత్రానికి నిర్మాత. సెన్సార్ చిక్కులు వస్తే న్యాయ పోరాటం కోసం టీమ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అడ్వకేట్‌ని సంప్రదించింది.
రాజకీయం నూటికి నూరు శాతం
నూటికి నూరు పాళ్లూ ఈ సినిమా వెనక రాజకీయం ఉంది. సినిమాలోనూ రాజకీయం ఉంది. కానీ సాక్ష్యాత్తూ ఎన్టీఆర్ చెప్పిన తర్వాత కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీకే (Telugu Desam Party)పట్టం కట్టారు.
అలాంటిది ఇన్నేళ్ల తర్వాత ఆ చరిత్రను సినిమాగా తీసుకొచ్చి, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వదులుతామంటే, తద్వారా రాజకీయ లభ్ధి చేకూరుతుందా.? ఏమో.. సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది.
ఎన్నికల ముందర తమను రాజకీయంగా దెబ్బ తీయడానికే ఈ ప్రయత్నమంటూ తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కానీ, చరిత్రలోని నిజాల్ని చూపించే ప్రయత్నం తప్ప, ఇందులో రాజకీయం ఏమీ లేదని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెబుతున్నారు.
ఏది నిజం.? మార్చి 22 నుంచి 29కి మారిందిప్పడు సినిమా విడుదల తేదీ. మార్చి 29న అయినా విడుదలవుతుందా? మళ్ళీ వాయిదా పడుతుందా? వేచి చూడాలిక.