RGV Oscars Nara Lokesh.. తమలపాకుతో నువ్వొకటిస్తే, తలుపు చెక్కతో నేనొకటిస్తా.. అన్నాడట వెనకటికి ఒకడు.! ఇది సరిగ్గా సరిపోతుంది, రామ్ గోపాల్ వర్మకి.!
ఇంతకీ, తమలపాకుతో ఎవరిచ్చారు.? తలుపు చెక్కతో ఎవరిచ్చారు.? విషయంలోకి వెళితే, టీడీపీ నేత నారా లోకేష్, రాయలసీమలో ‘యువగళం పాదయాత్ర’ ముగించుకున్నారు.
ఈ క్రమంలో, నేల తల్లికి ముద్దాడారు.. కృతజ్ఞతాపూర్వకంగా. ఈ మేరకు ఆయన ఓ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
RGV Oscars Nara Lokesh.. సెటైర్లు పడతాయ్ మరి..
షరామామూలుగానే రాజకీయ ప్రత్యర్థులు నారా లోకేష్ మీద సెటైర్లేశారు. అది రాజకీయం.!
రామ్ గోపాల్ వర్మకి ఏం పని.? ఆయనేమన్నా రాజకీయ నాయకుడా.? ‘ఆస్కార్ అవార్డు నారా లోకేష్‌కి ఇవ్వాలి..’ అంటూ సోషల్ మీడియాలో ఓ వెకిలి ట్వీటేశాడు వర్మ.
అంతే, ‘తలుపు చెక్కతో ఒకటి కాదు.. వందలు వేలు.. ఇచ్చేశారు’ రామ్ గోపాల్ వర్మకి, టీడీపీ మద్దతుదారులు.!
దాక్కోవడమెందుకు ఆర్జీవీ..
కేవలం సినీ జీవిగా దాక్కోవడమెందుకు.? ఆ ముసుగు తీసేసి, వైసీపీ రంగులేసేసుకోవచ్చు కదా.!
వైసీపీ నేతగా ఆర్జీవీ ఈ విమర్శ చేస్తే, ఆయన్ని తప్పు పట్టడానికి లేదు. కానీ, అబ్బే, రాజకీయాలతో తనకు సంబంధం లేదంటూనే.. ఈ వెకిలితనమేంటో.!
అందుకే, ఆర్జీవీ.. నీ లత్కోరు వేషాలు ఆపెయ్.. అంటున్నారు టీడీపీ మద్దతుదారులు. అదండీ అసలు సంగతి.