RGV Vyooham Movie YSRCP.. రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడట. ఈ మేరకు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు విడుదల చేస్తున్నాడు.
గత కొంత కాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం శక్తి యుక్తులన్నీ వినియోగిస్తున్న రామ్ గోపాల్ వర్మ, ‘వ్యూహం’ పేరుతో ఆ పార్టీ కోసమే ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఇంతకీ, ‘వ్యూహం’లో (Ram Gopal Varma Vyooham) ఏం వుండబోతోంది.? దీనిపై భిన్న వాదనలున్నాయి.!
RGV Vyooham Movie YSRCP.. ఎవరి వ్యూహం.! ఎందుకీ వ్యూహం.?
కొత్తగా రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ‘వ్యూహం’తో (Vyuham) ఏం చెప్పబోతున్నాడు.? ఏమో, అది ఆయనకే తెలియాలి.
మానసా రాధాకృష్ణన్ ఈ సినిమాలో నటిస్తోంది. అజ్మల్ కూడా నటిస్తున్నాడు. అజ్మల్ అంటే, తెలుగులో ‘రచ్చ’ సినిమాలో చేశాడు కదా.. అతనే.

అన్నట్టు, మానస రాధాకృష్ణన్ (Manasa Radhakrishnan) కూడా ఓ తెలుగు సినిమాలో ఈ మధ్యనే నటించింది. ఆ సినిమా పేరు ‘హై వే’.
ఇంతకీ, ఇది ‘ఎవరి’ వ్యూహం.? (Vyuham) ఎందుకీ వ్యూహం.? (Vyuham Movie) అదైతే సినిమా చూస్తేనే తెలుస్తుంది.
మీమ్స్.. పోటెత్తుతున్నాయ్..
నిజానికి, రామ్ గోపాల్ వర్మ ఏ వ్యూహంతో ఈ ‘వ్యూహం’ సినిమా తీస్తున్నాడో చూచాయిగా అందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మేలు చేయడం ఆర్జీవీ (Ram Gopal Varma) ‘వ్యూహం’ (Vyooham Movie) తాలూకు ఉద్దేశ్యం.
అయితే, విడుదలైన ఫొటోలతో కొత్త కథలు అల్లుతున్నారు నెటిజనం. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన ‘వ్యూహం’గా సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.
Also Read: Priya Prakash Varrier.. జలకాలాటల్లో అందాల చేప ‘పిల్ల’.!
ఆ సెటైర్లకు విపరీతమైన క్రేజ్ కూడా వచ్చి పడుతోంది. చూస్తోంటే, వర్మ (Ram Gopal Varma) ‘వ్యూహం’ బెడిసి కొట్టేలానే వుంది.
ఆంటే, ఆర్జీవీ (Ram Gopal Varma) వ్యూహం.. వైసీపీని (YSR Congress Party) నిండా ముంచెయ్యడమేనా.? అంతేనేమో.!