RGV Vyooham Political Shapadham.. ఆర్జీవీ సినిమా అంటే ఒకప్పుడు ఆ కిక్కే వేరప్పా.! కానీ, ఇప్పుడు కేవలం వోడ్కా కిక్కులోనే బతికేస్తున్నాడు ఒకప్పటి ఆ సంచలన దర్శకుడు.!
ఏమయ్యింది రామ్ గోపాల్ వర్మకి.? అని అనాల్సిన పనిలేదు. ఆయన బాగానే వున్నాడు.! పబ్బుల్లో అమ్మాయిలతో పండగ చేసుకుంటున్నాడు.
అదే అమ్మాయిల కాళ్ళు నాకేందుకు సైతం అస్సలేమాత్రం సిగ్గు పడటంలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే బొత్తిగా సిగ్గొదిలేశాడు.
RGV Vyooham Political Shapadham.. ఇదీ ఓ బతుకేనా?
ఏం బతుకురా నీది.? అని ఎవరన్నా ప్రశ్నించినాసరే లైట్ తీసుకుంటాడు. కొంత మంది మూర్ఖులు మాత్రం, ‘బతికితే రామ్ గోపాల్ వర్మలా బతకాలి’ అంటుంటారు.!
అదే, ఆ కొంతమందే రామ్ గోపాల్ వర్మకి ఆక్సిజన్.! దిగజారడంలో కొత్త లోతుల్ని ఎప్పటికప్పుడు వోడ్కా మత్తులో వెతుక్కునే వర్మ, ఆ వోడ్కా పైసల్ కోసం సినిమాలు తీస్తున్నాడు.

ఈ క్రమంలోనే ‘వ్యూహం’, ‘శపథం’ సినిమా జాలువారుతున్నాయి రామ్ గోపాల్ వర్మ.! వర్మ సినిమాలు వస్తాయ్, పోతాయ్.!
కొన్నయితే ప్రారంభమవుతాయి, పూర్తవవు. ఇంకొన్ని ప్రకటనల దగ్గరే ఆగిపోతాయ్.! ఇలా కొన్ని మాత్రమే, థియేటర్ల దాకా వస్తుంటాయ్.
‘వ్యూహం’, ‘శపథం’ ఇంకా విడుదల కాలేదు.. చివరి నిమిషం వరకూ అనుమానమే.! న్యాయ వివాదాల్లో ఇరుక్కుని, సినిమా విడుదల ఆలస్యమయ్యిన సంగతి తెలిసిందే.
వైసీపీకి ఒరిగేదేం లేదు.. టీడీపీ, జనసేనకి నష్టమూ లేదు..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం రూపొందిన సినిమా ఇది. వైసీపీకి ఈ సినిమా వల్ల ప్లస్ అయ్యేదేమీ వుండదు. కాకపోతే, వైఎస్ జగన్ రాజకీయ ప్రత్యర్థుల మీద ఇదొక అస్త్రం అంతే.
అఫ్‌కోర్స్.. ఆర్జీవీ సినిమాని, వైసీపీనే పెద్దగా పట్టించుకోనప్పుడు, ఇతర రాజకీయ పార్టీలు ఎలా పట్టించుకుంటాయ్.?
Also Read: ‘దేవర’ కొత్త డేటు.! అయినా, మళ్ళీ అదే డౌటు.!
అయినా, ఈ తరహా పొలిటికల్ సినిమాకి ఆడియన్స్ ఎప్పుడూ వుండరు. యూ ట్యూబ్‌లోనో సొంత ఓటీటీ వేదికలపైనో విడుదల చేసుకోవాలి.
వీటిల్లోని సీన్స్, ట్రోలింగ్ మెటీరియల్‌గా ఉపయోగపడతాయ్. సరిపోదా అది ఆర్జీవీ వోడ్కా ఖర్చు కోసం.! మరి, నిర్మాత పరిస్థితేంటి.? ఏముంటుంది.. ఖర్చు దండగ వ్యవహారమంతే.!