Table of Contents
రాజకీయ నాయకులు జైలుకెళ్తే పబ్లిసిటీ వస్తుంది. తద్వారా అధికార పీఠం ఎక్కే ఛాన్సూ దొరుకుతుంది. ప్రజల్ని ఉద్దరించి జైలుకెళ్లడం గురించి కాదు, మనం మాట్లాడుకునేది.. ఆర్ధిక నేరాలకు పాల్పడి, ఆ కారణంగా జైలుకెళ్లొచ్చినోళ్ల సంగతి ఇది. సినిమా, రాజకీయం (Aryan Khan Drugs) వేర్వేరు కాదు.
జైలుకెళ్లి రావడం సినీ రంగంలోనూ ఫ్యాషన్ అవుతోంది. దారుణమైన విషయమేంటంటే, డ్రగ్స్ కేసుల్లో అరెస్టయ్యి, జైలుకెళ్లొస్తున్నారు సినీ ప్రముఖులు. నేరం నిరూపితమవడం మన దేశంలో చాలా చాలా కష్టం కనుక, ఎంత పెద్ద నేరాభియోగం మీద పడితే, అంత పాపులారిటీ దొరుకుతుంది సెలబ్రిటీలకు.
జైలుకెళితే వచ్చే పబ్లిసిటీ కిక్కే వేరప్పా..
సంజయ్‌ద్, సల్మాన్ ఖాన్.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా చాలా పెద్దది. తాజాగా బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ఆర్యన్ ఖాన్ హీరోగా కొత్త సినిమా అనౌన్స్ చేసినా రానంత పబ్లిసిటీ ఇలా వచ్చేసింది.
Also Read: మత్తు.. గమ్మత్తు: హీరోయిజమా? జీరోయిజమా?
ఈ మధ్యనే బాలీవుడ్ నటి రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో అరెస్టయ్యింది. కొన్నాళ్లు జైల్లో కూడా ఉంది. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యింది. 10 సూపర్ హిట్ సినిమాలు చేసినా రానంత పబ్లిసిటీ, డ్రగ్స్ కేసులో అరెస్టవడంతో ఈమెకు వచ్చేసింది.

పోర్న్ వీడియోల రాకెట్.. ఇది మరీ టూమచ్..
రాజ్ కుంద్రా విషయానికి వస్తే, ఏకంగా పోర్న్ వీడియోల రాకెట్ కేసులో అరెస్టయ్యాడు. ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ప్రముఖ వ్యాపార వేత్త కూడా. సినిమాలు, వ్యాపారాలతో వచ్చిన పబ్లిసిటీ కంటే, వంద రెట్లు పబ్లిసిటీ పోర్న్ రాకెట్ ద్వారా సంపాదించాడు రాజ్ కుంద్రా.
Also Read: 75 ఏళ్ళ స్వాతంత్ర్యం.. జరుగుతోందా న్యాయం.?
కన్నడ సినీ పరిశ్రమలో సంజన డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమలోనూ పలువురు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అసలు తప్పు ఎక్కడ జరుగుతోంది.
పిల్లి మెడలో గంట కట్టేదెవరు.?
తీవ్రమైన నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఆయా కేసుల ద్వారా వస్తున్న పబ్లిసిటీ, వాళ్లను మరింత పెద్ద స్టార్లుగా మార్చుతోందంటే వ్యవస్థలోనే లోపముంది.
పిల్లి మెడలో గంట కట్టేదెవరు.? ఈ రోగానికి మందు ఎక్కడ.? ఆ ఒక్కటీ (Aryan Khan Drugs) అడక్కూడదంతే.