Rhea Chakraborty New Innings: తెలుగులో ‘తూనీగా తూనీగా’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది బెంగాలీ ముద్దుగుమ్మ రియా చక్రవర్తి.
ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా నటించిన సినిమా అది. అయితే, ఒకే ఒక్క తెలుగు సినిమాలో నటించినందుకో ఏమో, ఈ పాప పేరు తూనీగ పాపగా స్థిరపడిపోయింది.
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి (Sushanth Singh Rajput) ఈ పాప గర్ల్ ఫ్రెండ్ అన్న సంగతి తెలిసిందే. సినిమాలతో వచ్చిన పాపులారిటీ కన్నా, సుశాంత్ మరణానంతరం, వివాదాలతోనే ఎక్కువగా పాపులారిటీ దక్కించుకుంది బెంగుళూర్ బ్యూటీ రియా చక్రవర్తి.
Rhea Chakraborty New Innings.. వివాదాలే వెనక్కి నెట్టేశాయా.?
‘జిలేబీ’ తదితర సినిమాలతో అప్పుడప్పుడే కాస్తో కూస్తో పాపులారిటీ దక్కించుకుంటోన్న ఈ అమ్మడు, సుశాంత్ సూసైడ్ ఘటనతో అందరి నోళ్లలోనూ తెగ నానేసింది. అలా వెంటాడిన దురదృష్టం ఆమె కెరీర్ నాశనానికి దారి తీసిందనే చెప్పాలి.

అంతేకాదు, డ్రగ్ర్స్ఆరోపణలను సైతం తీవ్రంగా ఎదుర్కోవల్సి వచ్చింది ఈ బ్యూటీకి. ప్చ్. ఎంత కష్టమో కదా.!
అంత జరిగినా, ఆ తర్వాత తెలుగులో ఓ యంగ్ హీరో రియా చక్రవర్తికి హీరోయిన్‌గా ఛాన్సిచ్చాడంటూ ప్రచారం జరిగింది. ఇంకేముంది. రియా (Rhea Chakraborty) మళ్లీ పుంజుకోవడం ఖాయమనుకున్నారంతా.
కానీ, జస్ట్ ప్రచారంగానే మిగిలిపోయిందది. ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్.. దొరికితే చాలు జాక్ పాట్ కొట్టేందుకు రెడీ అంటోంది.

యాక్టింగ్ కెరీర్‌కి ముందు బుల్లితెరపై వీజేగా పని చేసిన అనుభవం వున్న రియా చక్రవర్తి (Rhea Chakraborty New Innings) పెద్ద తెరపై స్టార్‌గా వెలిగిపోవాలనుకుంది. కానీ, వర్కవుట్ అవ్వలేదు ఫాఫం.
Also Read: చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప.. ఈ భ్రష్టత్వం ఎవరిదప్పా.!
అందాకా సోషల్ మీడియాలో ఘాటు ఘాటుగా ఫోటో పోస్టులు పెడుతూ తృప్తిపడుతోంది అందాల రియా చక్రవర్తి (Rhea Chakraborty). తాజాగా ఎల్లో కలర్ గాగ్రా చోళీలో ట్రెడిషనల్‌గా కనిపిస్తూనే స్పైసీ లుక్స్‌తో కుర్రోళ్లను కవ్విస్తోంది అందాల తూనీగ.