తెరపై రెండు సింహాలు గర్జిస్తే ఎలా వుంటుంది.? రెండు కాదు, మూడో సింహం కూడా వుందిక్కడ. ఓ సింహం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే, మరో సింహం యంగ్ టైగర్ ఎన్టీయార్. మూడో సింహం రాజమౌళి (Roar Of RRR Spectacular Glimplse). వీరితోపాటూ, అజయ్ దేవగన్, సముద్రఖని.. ఇలా ప్రతి ఒక్కరూ గర్జించేవారే.
Roar Of RRR అంటూ ‘ఆర్ఆర్ఆర్ గర్జన’ పేరుతో గ్లింప్స్ విడుదల చేసింది ఆర్ఆర్ఆర్ బృందం. రాజమౌళి అంటేనే, ఇలాంటివాటిల్ని రూపొందించడంలో మాస్టర్. తనదైన ముద్ర ఇంకోసారి ఇంకా ఇంకా బలంగా వేసేశారు తాజా Glimpse తో.
‘బాహుబలి’తో పోల్చడం ఎంతవరకు సబబు.? అన్న చర్చ అనవసరం. ఎందుకంటే, రాజమౌళి ఒక్కో సినిమాతోనూ ఇంకో మెట్టు పైకెక్కుతుంటాడు.. తనతోపాటు తెలుగు సినిమా ఖ్యాతినీ, భారతీయ సినిమా ఖ్యాతినీ పెంచుకుంటూ వెళుతున్నాడు. ‘మగధీర’ అద్భుతాల్ని మించి, ‘బాహుబలి’ అద్భుతాల్ని చూశాం. ఇప్పుడిక, ‘ఆర్ఆర్ఆర్’ అద్భుతాల్ని చూడబోతున్నాం.
మేకింగ్ వీడియో నిజంగానే బీభత్సమైన గర్జన (Roar Of RRR Spectacular Glimplse) చేస్తోంది. మేకింగ్ వీడియో చూసి, సినిమా చూసేసినంత ఆనందాన్ని పొందరుతున్నారు సగటు సినిమా అభిమానులు.
మేకింగ్ వీడియోనే ఇలా వుంటే, సినిమా ఇంకెలా వుండబోతోంది.? కరోనా భయాల నడుమ, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇప్పట్లో రావడం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ, ‘ఆర్ఆర్ఆర్’ వచ్చేస్తోంది.
గెట్ రెడీ ఫర్ ది స్పెక్టాక్యులర్ సిల్వర్ స్క్రీన్ సెన్సేషన్.