Home » ముద్రాభిప్రాయమ్: రోజాపై కనీసపాటి సింపతీ రావట్లేదేం.?

ముద్రాభిప్రాయమ్: రోజాపై కనీసపాటి సింపతీ రావట్లేదేం.?

by hellomudra
0 comments
Roja Selvamani

Roja Selvamani Vulgar Politics.. ఆమె సినీ నటి.. పైగా, ఒకప్పుడు ప్రజా ప్రతినిథి. ప్రస్తుతం ఓ రాజకీయ పార్టీలో కీలక నేత. ఓ మహిళపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడమేంటి.?

నాన్సెన్స్.. ఇది నిజంగానే అభ్యంతరకరం. కానీ, మహిళల మీద దిగజారుడు వ్యాఖ్యలు చేస్తేనే నేరమా.? మగాళ్ళపై నోటొకొచ్చినట్లు వాగితే తప్పు లేదా.?

తప్పే.! తప్పు ఎవరు చేసినా, అది తప్పుగానే పరిగణించాల్సి వస్తుంది. వైసీపీ నేత, మాజీ మంత్రి, ఒకప్పటి సినీ నటి రోజా గురించే ఇదంతా.!

Roja Selvamani Vulgar Politics.. రోజా.. అభ్యంతరకర వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్..

డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందుకెళ్ళి తొడగొట్టకూడదు.. ఇత్తడైపోద్ది.. ఇలాంటి వ్యాఖ్యలు రోజా నోటి వెంట అలవోకగా వచ్చేస్తాయ్.

పోలీసు అధికారుల మీద కూడా, ‘లం.. కొడుకులు’ అనే మాటని చాలా తేలిగ్గా ప్రయోగించేస్తుంటారు రోజా. ‘ఎవర్నయినా నేను తిడతాను, నన్ను మాత్రం ఎవరూ ఏమీ అనకూడదు’ అనే నైజం రోజాది.

గతంలో సినీ నటి రేణు దేశాయ్ మీద రోజా చేసిన అభ్యంతకర వ్యాఖ్యల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

టీడీపీ అధినేత చంద్రబాబు మీదా, ఆయన కుమారుడు నారా లోకేష్ మీదా రోజా దారుణమైన వ్యాఖ్యలు చేశారు గతంలో. ఇప్పటికీ ఆమె నోటికి హద్దూ అదుపూ లేకుండా పోతోంది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద రోజా చేసే అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళి, నచ్చినవి వండించుకుని, సకుటుంబ సమేతంగా ఆరగించి.. తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన చందాన, చిరంజీవి మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడం రోజాకే చెల్లిందేమో.

ఇది మామూలు చరిత్ర కాదు.. బూతు చరిత్ర..

రోజా ట్రాక్ రికార్డ్ ఎలా వుందో అర్థమయ్యింది కదా.! రోజా ఎవరెవరి మీద ఎప్పుడెప్పుడూ అభ్యంతకరమైన, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిందీ.. వీడియోలతో సహా సోషల్ మీడియాలో అన్నీ వున్నాయ్.

ఆ బూతు చరిత్రను తన వెనకాల పెట్టుకుని, తనను ఎవరో ఏదో అన్నారంటూ రోజా కంటతడి పెట్టేస్తున్నారు. ఇది ఇంకా పెద్ద కామెడీ.

నిజానికి రోజా మీద టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు సమర్థనీయం కాదు.

‘2 వేలు ఇస్తే, ఏ పనైనా చేస్తుంది. మార్కెట్ రేటు అది.. వ్యాంప్‌కి ఎక్కువ.. హీరోయిన్‌కి తక్కువ’ అంటూ గాలి భాను ప్రకాష్, రోజాపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు.

ఎవరు చేసినా.. తప్పు తప్పే కదా.!

ఓ ప్రజా ప్రతినిథి అయి వుండీ, గాలి భాను ప్రకాష్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి వుండకూడదు. ఆయన, తాను చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తూ, ఓ ప్రకటన విడుదల చేస్తే మంచిది.

కానీ, అంతకన్నా ముందు.. సభ్య సమాజానికి రోజా, క్షమాపణలు చెప్పి తీరాలి. రాజకీయాల్లో, రోజా బూతులకు చెక్ పడాలి.

టీడీపీలో వుండి, వైఎస్ రాజశేఖర్ రెడ్డిపైనా, వైసీపీలోకి వెళ్ళాక చంద్రబాబుపైనా.. నోరు పారేసుకున్నారు రోజా. ఇది ఆమెకి ఓ అలవాటుగా మారిపోయింది.

ఈ బూతు చరిత్రకు చరమగీతం పాడాల్సిందే. 2024 ఎన్నికల్లో నగిరి నియోజకవర్గ ప్రజలు, ఆమెను ఛీత్కరించారన్నది రాజకీయ ప్రత్యర్థులు చేసే విమర్శ.

ఆ సంగతి పక్కన పెడితే, తన బూతులు తనను ఓడించాయని ఆమె గుర్తెరిగితే, ఆమె రాజకీయ భవిష్యత్తుకే మంచిది.

రోజాపై రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తేనో, మార్ఫింగులు చేస్తేనో కుటుంబ సభ్యులు బాధపడితే.. అదే బాధ, ఆమె ఇతర రాజకీయ నాయకుల్ని తిట్టినప్పుడు వారి కుటుంబ సభ్యులకీ వుంటుంది కదా.?

ఇదే, ఇందుకే.. రోజాపై ఎక్కడా సింపతీ అనేదే కనిపించడంలేదు. ‘ఆమెకిలా జరగాల్సిందే..’ అన్న చర్చ అంతటా జరుగుతోంది. రాజకీయంగా వైసీపీ, రోజా ఉదంతాన్ని వాడుకోవచ్చుగాక.

కానీ, రోజా తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాజకీయాలంటే బూతులు కాదు.. ఒకవేళ రాజకీయమంటే బూతులేనని ఆమె తన పంథా ఇలానే కొనసాగిస్తే, బూతులు ఎదుర్కోడానికీ సిద్ధంగానే వుండాలి.

వెంటనే రోజా, సింపతీ డ్రామాలు ఆపెయ్యాలి.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group