Table of Contents
Roja Vs Nara Lokesh.. మీకో సామెత తెలుసా.? ‘తమలపాకుతో నువ్వొకటిస్తే తలుపు చెక్కతో నేనొకటిస్తా.. అన్నాడట వెనకటికి ఒకడు’. ఇదీ సామెత.!
ప్రస్తుత రాజకీయాలకు అచ్చంగా సూటయిపోతుంది ఈ సామెత.! అంతే మరి, అట్నుంచి ఓ మాట వస్తే చాలు.. ఇట్నుంచి నాలుగైదు మాటల తూటాలు వెళ్ళిపోతాయ్.!
సినీ నటి రోజా ‘ఇత్తడైపోద్ది’ అంటూ సినిమాల్లో చెప్పిన ‘డబుల్ మీనింగ్’ డైలాగులు అందరికీ గుర్తుండే వుంటాయ్.
రాజకీయాల్లోనూ అంతకు మించిన స్థాయిలో రోజా నోట ‘డైలాగులు’ వచ్చేస్తున్నాయ్. ‘డిక్కీ బలిసిన కోడి’ అంటారు.. ఇంకేవేవో విమర్శలు చేస్తుంటారు.
Roja Vs Nara Lokesh.. జబర్దస్త్ ఆంటీ..
తాజాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా నగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
నగిరి ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన రోజా మీద తనదైన స్టయిల్లో ‘జబర్దస్త్ ఆంటీ’ అంటూ సెటైర్లేశారు నారా లోకేష్.
‘పప్పు.. పులకేశి..’ అంటూ తన మీద రోజా చేస్తున్న విపరీత వ్యాఖ్యలకు నారా లోకేష్ ‘జబర్దస్త్ ఆంటీ’ అంటూ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.
పళ్ళు రాలగొడ్తా..
‘నన్ను జబర్దస్త్ ఆంటీ అంటావా.? నువ్వే పులకేశి.. మీ అమ్మ హెరిటేజ్ ఆంటీ..’ అంటూ రోజా విరుచుకుపడిపోయారు.
‘మీ నాన్న, నువ్వు, మీ అమ్మ.. నీ భార్య.. మీ అందరికీ పంపకాలు.. గొడవలు అలవాటు.. అత్తా కోడళ్ళు (భువనేశ్వరి, బ్రాహ్మణి) మధ్య గొడవలున్నాయ్..’ అంటూ రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాగా, రోజా అలాగే ఆమె సోదరులు అవినీతికి పాల్పడుతున్నారని నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
కుక్క కాటుకి చెప్పు దెబ్బ..
రాజకీయాల్లో విమర్శలు.. ప్రతి విమర్శలూ మామూలే.! ఇట్నుంచి నోరు జారితే.. అట్నుంచి కూడా అంతకు మించిన స్థాయిలో నోరు జారడం అనేది సర్వసాధారణం.
‘నన్నే అంత మాట అంటావా.?’ అని ఎవరైనా రాజకీయాల్లో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
Also Read: Vande Bharat Express సామాన్యుడికేం తెచ్చింది.?
రోజా అయినా, నారా లోకేష్ అయినా.. ఇంకొకరైనా.. రాజకీయాల్లో తాము హుందాతనం పాటించి, ఇతరుల నుంచి హుందాతనాన్ని ఆశిస్తే మంచిది.
లేదంటే, కుక్క కాటుకి చెప్పు దెబ్బ.. అనే మాట అందరికీ వర్తిస్తుంది.