Table of Contents
ఛీ పాడు.. ఇదేం లోకం.? అని ముక్కున వేలేసుకుంటున్నా.. ఇది నిప్పులాంటి నిజం. ఐదో తరగతి, ఆ పైన తగతుల విద్యార్థులకు పాఠశాలల్లో రక్షణ కవచాలు.. అవేనండీ కండోములు అందుబాటులో వుంచాలంటూ (Romantic Education From School Stage) ఓ ఎడ్యుకేషన్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇండియాలో కాదులెండి.. అగ్రరాజ్యం అమెరికాలో.
అమెరికాలోని షికాగో పబ్లిక్ స్కూల్స్ ఎడ్యుకేషన్ బోర్డు తీసుకున్న ఈ సంచలన నిర్ణయం కొందరికి ఆనందాన్నిస్తే, మరికొందరికి ‘షాక్’ కలిగించింది. ఇదెక్కడి పైత్యం.? అని చాలామంది ముక్కున వేలేసుకుంటున్నారు. శృంగార విద్యలో ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందట. అంటే, పాఠశాల స్థాయి నుంచే శృంగార పాఠాలు చెప్పేసే విధానం.. అనుకోవాలేమో.
ఇదేం వైపరీత్యం మహాప్రభో..
షికాగో ఆరోగ్య శాఖ సహకారంతో కండోములని సరఫరా చేస్తారట. ఎలిమెంటరీ స్కూళ్ళలో, హైస్కూళ్ళలో.. కండోములను అందుబాటులో వుంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కండోములు అందించడమే కాదు, శరీర నిర్మాణ శాస్త్రం, కౌమార యుక్త వయసులో శరీరంలో కలిగే మార్పులు, లైంగిక ధోరణలు, లైంగిక ఆరోగ్యం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారట. కాస్త ఊరటేంటే, ఈ వ్యవహారంపై తమ అభ్యంతరాల్ని తల్లిదండ్రులు బోర్డుకి తెలియజేసేందుకు అవకాశమివ్వడం.
Also Read: విద్యావ్యవస్థకి డబ్బు జబ్బు.. నేరమెవరిది.? శిక్ష ఎవరికి.?
ఆరోగ్యాన్ని సంరక్షించేందుకే ఈ చర్యలు చేపడుతున్నామన్నది అక్కడి అధికారుల వాదన. కండోములు వాడాలని ఎవరైనా అనుకుంటే, వారికి అవి అందుబాటులో వుంచడమే తమ పని అని ఓ అధికారి సెలవిచ్చారు. కండోముల లభ్యత లేకపోతే, లైంగిక సంక్రమణ వ్యాధులు, అవాంఛిత గర్భాలు వస్తాయనేది అధికారుల వాదన.
శృంగార విద్య అవసరమా.?
ఇదిలా వుంటే, పన్నెండేళ్ళ వయసులోనే వారికి శృంగార విద్య అవసరమా.? అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది.? సమాజాన్ని ఎటువైప నడిపిస్తున్నారు.? అంటూ సీపీఎస్ బోర్డు నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.
Also Read: అయితే పగిలిపోవాలి.. లేదంటే షాకవ్వాలి.!
ఔను, కాలం మారింది. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో వుంది. అక్కడ అవసరమైనదీ, అవసరం లేనిదీ సమాచారం చాలా దొరుకుతోంది. పిల్లలు ఇంటర్నెట్‌కి బానిసల్లా మారిపోతున్నారు. దాంతో, శృంగారపరమైన ఆలోచనలు (Romantic Education From School Stage) విద్యార్థుల్లో పెరిగిపోతున్నాయి. పిల్లలపై లైంగిక దాడులు, అసహజ శృంగారం.. ఇవన్నీ విరివిగా వింటున్న విషయాలే.
అగ్రరాజ్యం అమెరికాలోనే కాదు, మన దేశంలోనూ విపరీత పోకడలు ఇటీవల పెరిగిపోయాయి. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలపై లైంగిక దాడులు.. అదుపుచేయలేని స్థాయికి పెరిగిపోయాయి. అలాగని, చిన్నప్పటినుంచే విద్యా సంస్థల్లో కండోములు అందుబాటులో వుంచడం.. సమస్యకు పరిష్కారమా.? అది ఏ దేశంలో అయినా తప్పే. లైంగిక దాడుల పట్ల అవగాహన కల్పించడమొక్కటే పాలకుల ముందున్న తక్షణ కర్తవ్యం.