Table of Contents
బిగ్‌హౌస్‌లో రొమాంటిక్ కపుల్ ఇంకెవరు.! వరుణ్ సందేశ్ (Bigg Boss 3 Varun Sandesh), వితిక షెరు.. రియల్ లైఫ్ కపుల్ గనుక, బిగ్ బాస్ రియాల్టీ షోలోనూ ఈ ఇద్దరి మధ్యా బీభత్సమైన రొమాంటిక్ ట్రాక్ నడిచేస్తోంది. ఈ వీక్ ఎలిమినేషన్స్‌కి సంబంధించి వరుణ్ సందేశ్ నామినేట్ అవలేదు.
ఎందుకంటే, అతను కెప్టెన్ గనుక. కానీ, వితిక షెరు (Vithika Varun) నామినేషన్స్‌లో వుంది. ఆమె వికెట్ పడిపోతుందేమోనన్నది వరుణ్ సందేశ్ * భయం. అదే భయాన్ని పదే పదే వ్యక్తం చేస్తున్నాడు వరుణ్ సందేశ్, తన భార్య దగ్గర.
‘ఏమో, ఈ వారం నువ్వు బయటకు వెళ్ళిపోతావేమో..’ అంటూ వరుణ్ (Varun Sandesh) ఆందోళన వ్యక్తం చేస్తోంటే, వితిక అతన్ని ఓదార్చుతోంది. ‘వెళ్ళిపోతే, వెళ్ళిపోతానేమో.. నిన్ను టీవీలో చూస్తూనే వుంటాను కదా..’ అంటూ వరుణ్‌తో చెబుతోంది వితిక (Vithika Sheru). ‘అయినా, అవన్నీ ఇప్పుడెందుకు.? శనివారం చూసుకుందాం లే..’ అంటూ వితిక తేల్చేసింది.
ఈ ఇద్దరూ తమ తమ చేతులతో లవ్ సింబల్‌ని చూపిస్తోంటే, ఆ రొమాంటిక్ ట్రాక్‌ని ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు వీరి అభిమానులు. మరోపక్క, హేటర్స్ కూడా అదే స్థాయిలో వరుణ్, వితికలను ట్రోల్ చేస్తున్నారు.
అన్నట్టు, బిగ్‌హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి, హౌస్‌లోకి వస్తూనే వరుణ్ సందేశ్‌ని టార్గెట్ చేస్తున్నట్లు చెప్పింది. ఆ ఇద్దర్నీ విడదీసి తీరతానంటూ శపథం కూడా చేసింది. అయితే, ఆ తర్వాత మారిపోయింనుకోండి. అది వేరే సంగతి.
శ్రీముఖికి క్లాస్ పీకిన బిగ్ బాస్..
ఇక, బిగ్ హౌస్‌లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌ని జుగుప్సాకరంగా, భయానకంగా మార్చేసినందుకు హౌస్‌మేట్స్ తగిన శిక్షనే అనుభవించాల్సి వచ్చింది. టాస్క్‌ని బిగ్‌బాస్ రద్దు చేశాడు.
గాయపడ్డ రవికృష్ణని (Ravi Krishna) బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి, చేతికి గాయమైన దరిమిలా.. టాస్క్‌లకు దూరంగా వుండే అవకాశం కల్పించాడు. ఇదిలా వుంటే, రవికి గాయం కావడానికి కారణం శ్రీముఖి (Sree Mukhi) అని తేల్చేసిన బిగ్‌బాస్, ఆమెను నేరుగా నామినేట్ చేయడం గమనార్హం.
కాగా, బిగ్ హౌస్ నుంచి ఇద్దరు హౌస్ మేట్స్ పునర్నవి భూపాలం (Punarnavi Bhupalam), అలీ రెజా (Ali Reza) మాయమైపోయారు రాత్రికి రాత్రే. ఇది బిగ్‌బాస్ కొత్త టాస్క్‌లో భాగం. ఎవరికీ తెలియకుండా ఈ ఇద్దర్నీ విడివిడిగా స్పెషల్ రూమ్‌లోకి వచ్చేలా చేశాడు బిగ్‌బాస్. అక్కడ ఈ ఇద్దరూ వుండగా, వారి కోసం కొన్ని త్యాగాలు చేయాలని మిగతా హౌస్‌మేట్స్‌కి బిగ్‌బాస్ సూచించాడు.
బిగ్ హౌస్.. చెత్త రిలేషన్స్..
అయితే, వాళ్ళు బిగ్‌హౌస్‌లోకి రాకపోయినా తనకేమీ ఇబ్బంది లేదని హిమజ (Himaja) చెప్పగా, బయటే ఆ ఇద్దరూ హ్యాపీగా వుంటారనే వంక పెట్టి, బాబా భాస్కర్ (Baba Bhaskar) తన మనసులోని అసలు బుద్ధిని బయటపెట్టేసుకున్నాడు.
చెప్పులు లేకుండా వుండడం, పెరుగు తినకుండా వుండడం.. అనేవే ఆ త్యాగాలు. అంతకు మించి, మరికొన్ని త్యాగాల గురించి బిగ్‌బాస్ చెప్పగానే, హౌస్‌మేట్స్‌లో ఆందోళన బయల్దేరింది. ‘వాళ్ళెందుకు దండగ’ అనే అభిప్రాయానికి చాలామంది వచ్చేశారు. ఆ వివరాలేంటో రేపటి ఎపిసోడ్‌లో తెలుస్తాయి.
వరుణ్ వికెట్ పడగొట్టుకున్నాడు.. Bigg Boss 3 Varun Sandesh
ఇదిలా వుంటే, అతి పెద్ద షాక్ వరుణ్ సందేశ్‌కి తగిలింది. కెప్టెన్‌గా వున్న వరుణ్ సందేశ్, హిట్ వికెట్‌గా కెప్టెన్సీ కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. కెప్టెన్‌గా వుండి బిగ్‌హౌస్‌లో నియమాల ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు వరుణ్ సందేశ్‌పై బిగ్‌బాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించాడు బిగ్ బాస్ (Bigg Boss). అయితే, ఇది రేపటి ఎపిసోడ్‌కి సంబంధించిన సస్పెన్స్. వరుణ్, తన కెప్టెన్సీని కోల్పోయాడా.? లేదా? అన్నదీ రేపే తెలుస్తుంది.