RRR For Oscars.. ఓ తెలుగు సినిమా ప్రపంచ స్థాయి కీర్తిని అందుకుంటోందంటే.. అది ప్రతి భారతీయుడికీ గర్వకారణమే.. తెలుగువారికి మరింత గర్వకారణం.!
కానీ, ఆ సినిమా ‘ఆస్కార్’ పురస్కారాల బరిలోకి భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీ ఎందుకు సాధించలేకపోయింది.?
ఆర్ఆర్ఆర్’ సినిమాకి భారతదేశం తరఫున ఆస్కార్ అవార్డుల రేసులోకి అధికారిక ఎంట్రీ లభించకపోవడం పట్ల బాధ పడ్డాను..
SS Rajamouli
సగటు సినీ అభిమానికి ఈ విషయమై చాలా సందేహాలున్నాయి. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఎలా వుంటాయా.? అన్నదానిపై సామాన్యులకు అవగాహన వుండదు.
రాజమౌళి నిరాశ చెందాడు..
సామాన్యులకే కాదు, తనకీ ‘ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ నిబంధనలు ఆస్కార్ విషయమై ఎలా వుంటాయో తనకూ తెలియదని రాజమౌళి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.

రాజమౌళికి తెలియకుండా ఎలా వుంటుంది.? మాస్టర్ ఇన్ స్టోరీ టెల్లింగ్.. అంతే కాదు, మాస్టర్ ఇన్ సినిమా మార్కెటింగ్ కూడా అయిన రాజమౌళి.. అన్నీ తెలుసుకునే రంగంలోకి దిగుతాడు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇంకో మార్గంలో ఆస్కార్ పురస్కారాల బరిలోకి దిగింది. ప్రపంచ మీడియా దృష్టి ‘ఆర్ఆర్ఆర్’ వైపు మళ్ళేలా రాజమౌళి అండ్ టీమ్ చేయాల్సిందంతా చేస్తోంది.
RRR For Oscars .. ఆ విషయంలో ఆనందిస్తున్నా..
భారతదేశం తరఫున అధికారికంగా ‘ది లాస్ట్ షో’ సినిమా ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో చోటు దక్కించుకోవడం ఆనందంగా వుందని రాజమౌళి చెప్పడం గమనార్హం.
‘ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆస్కార్ అధికారిక ఎంట్రీల విషయంలో ఎలా వ్యవహరిస్తుంది.? అన్నది నాకు తెలియదు.. ఆ నిబంధనలు తెలియదు కాబట్టి నేను కామెంట్ చేయాలనుకోవడంలేదు’ అన్నాడు రాజమౌళి.
Also Read: ‘వాల్తేరు వీరయ్య’ మెగాస్టార్ చిరంజీవి ‘టూ పాయింట్ ఓ’.!
అంతే కాదు, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి భారతదేశం తరఫున ఆస్కార్ అవార్డుల రేసులోకి అధికారిక ఎంట్రీ లభించకపోవడం పట్ల బాధ పడినట్లు కూడా వివరించాడు.
‘బాధ పడుతూ కూర్చుంటే పనులు జరగవు. మా ప్రయత్నాలు మేం చేయాలనుకున్నాం.. ముందడుగు వేశాం..’ అని రాజమౌళి చెప్పుకొచ్చాడు.