RRR Movie First Review: క్షణాలు గంటల్లా గడుస్తోంటే.. గంటలు రోజుల్లా గడుస్తోంటే.. రోజులు సంవత్సరాల్లా గడుస్తోంటే.! ఇదీ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయమై అభిమానులు ఎదుర్కొంటున్న పరిస్థితి. నరాలు తెగే ఉత్కంఠని అనుభవిస్తున్నారు అభిమానులు.
సాధారణంగా సినిమా విడుదల అంటే అది నిర్మాతకి చాలా చాలా కష్టమైన వ్యవహారం. నటీనటులు, సాంకేతిక నిపుణులు సినిమా రిజల్ట్ కోసం తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తారు. అదే సమయంలో, అభిమానులూ అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటారు.
‘ఆర్ఆర్ఆర్’ విషయంలో ఈ ఉత్కంఠ మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఇంతకు ముందెన్నడూ చూడనిది.. భవిష్యత్తులో మళ్ళీ ఇలా చూస్తామో లేదో చెప్పలేనిది.
RRR Movie First Review.. సినిమా ఎలా వుందంటే.!
అందుకే, ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఏ కొత్త విషయం బయటకొస్తున్నా అది క్షణాల్లో వైరల్ అయిపోతోంది. మరి, ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) సినిమా రివ్యూ బయటకు వచ్చేస్తే.? ఆ కిక్కు మామూలుగా వుండదు.

ఉమైర్ సందు (Umair Sandhu RRR Review) అనే ఓ వ్యక్తి గల్ఫ్ దేశాల నుంచి తొలిసారిగా రివ్యూలు ఇచ్చేస్తుంటాడు ఏ కొత్త సినిమాకి అయినాసరే. ఆ రివ్యూల్లో వాస్తవికత ఎంత.? అన్నది వేరే చర్చ.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకీ ఉమైర్ సంధు రివ్యూ ఇచ్చేశాడు. చరిత్రలో నిలిచిపోయే సినిమాగా తన రివ్యూలో పేర్కొన్నాడు. అంతేనా, రామ్ చరణ్ (Mega Power Star Ramcharan) అలాగే ఎన్టీయార్ (Young Tiger NTR) నటన ఈ సినిమాకి ప్రాణం పోశాయన్నాడు.
కథ, స్క్రీన్‌ప్లే ఈ సినిమాని వేరే లెవల్‌కి తీసుకెళ్ళాయనీ అన్నాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్, రాజమౌళి మేకింగ్ టాప్ క్లాస్ అని చెప్పాడు. ఇదీ ఉమైర్ సంధు రివ్యూ.
Also Read: మ్యూజిక్ బాదుడు సరే.! ఈ గడబిడేంది తమన్.!
అన్నట్టు, ఉమైర్ సంధు (Umair Sandhu) గతంలో ‘రాధేశ్యామ్’ వంటి సినిమాలకూ ఇవే తరహా రివ్యూలు ఇచ్చాడనుకోండి.. అది వేరే సంగతి. అయితే, కెరీర్‌లో వైఫల్యమంటే ఏంటో ఎరుగని రాజమౌళి, తనదైన ట్రేడ్ మార్క్ విజయాలు అందుకుంటూనే వున్నాడు.
సినిమా సినిమాకీ తన స్థాయిని పెంచుకుంటున్న రాజమౌళి, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అంతకు మించి అనే స్థాయిలోనే అద్భుతాలు చేసేశాడని నిస్సందేహంగా చెప్పొచ్చు.