RRR Movie Funny Controversy: అసలెందుకు పుడతార్రా ఇలాంటోళ్లు.? అన్న చర్చ ఈ ‘మనోభావాల’ విషయంలో తరచూ తెరపైకొస్తుంటుంది.
సినిమాలో విలన్ పాత్ర పేరు చివర్న ‘రెడ్డి’ వుంటే చాలు, రెడ్డి సామాజిక వర్గాన్ని కించపర్చారంటూ మతిలేని వ్యాఖ్యలు చేస్తారు కొందరు రాజకీయ నాయకులు.! ఇదొక కుల పైత్యం.
ఇంకో సినిమా విషయంలో బ్రహ్మణ స్త్రీ పాత్రకు సంబంధించి కొన్నాళ్ళ క్రితం పెద్ద రచ్చే జరిగింది. అప్పుడూ ఇంతే, ‘మనోభావాలు దెబ్బతిన్నాయ్..’ అంటూ రోడ్డెక్కేశారు. అసలేంటీ మనోభావాల కథ.?
నిజమే, మనోభావాలు దెబ్బ తింటాయ్.!
తప్పు లేదు.! అవసరం వున్నా లేకున్నా, హాస్యం కోసమో.. క్రియేటివిటీ పేరుతోనో.. జుగుప్సాకరమైన రీతిలో లేదా అభ్యంతకరమైన రీతిలో లేదా వివాదాస్పదమైన రీతిలో కొన్ని పాత్రలకు కులాన్నో, మతాన్నో ఆపాదించి ఆయా పాత్రల్ని తీర్చిదిద్దితే తప్పుపట్టాల్సిందే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

కానీ, పాటలో పదాలపై అభ్యంతరాలు.. నటీనటుల కట్టూబొట్టుపైనా అభ్యంతరాలు.. ఆఖరికి సినిమా టైటిళ్ళ విషయంలోనూ అభ్యంతరాలు.. వెరసి, ‘మనోభావాలు’ అంటేనే అదో ‘బూతు’గా మారిపోయిందిప్పుడు.
RRR Movie Funny Controversy.. ‘ఆర్ఆర్ఆర్’ గొడవేంటి.?
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie). ఇందులో రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) పాత్ర స్వభావం అల్లూరి సీతారామరాజులా (Alluri Seetha Rama Raju) వుంటుందనీ, ఎన్టీయార్ (Young Tiger NTR) పాత్ర స్వభావం కొమరం భీమ్‌ని తలపించేలా వుంటుందనీ దర్శకుడు రాజమౌళి (Rajamouli) చెప్పాడు.
అయితే, ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాకి స్వాతంత్ర్య పోరాటంతోగానీ, చారిత్రక నేపథ్యంతోగానీ సంబంధం లేదనీ.. ఇది పూర్తిగా కల్పిత పాత్రలతో, కల్పిత కథ అని రాజమౌళి (Rajamouli) స్పష్టంగా చెప్పేసినా.. వివాదం తప్పడంలేదు.
Also Read: తీరం తాకిన Bheemla Nayak తుపాను.. ‘అహంకారం’ కకావికలం.!
అల్లూరిని అభ్యంతరకమైన రీతిలో చూపించారట.. కొమరం భీమ్ (Komaram Bheem) పాత్రనీ అభ్యంతకరంగానే చూపించారట.. ఇదీ ‘ఆర్ఆర్ఆర్’ మీద అభియోగం. కామెడీ కాకపోతే, సినిమా విడుదల కాకుండా అందులో ఏముందో ఎలా చెబుతారు ఎవరైనా.?
‘భీమ్లానాయక్’ (Power Storm Bheemla Nayak) సినిమా మీద రాజకీయ కక్ష సాధింపులు చాలక, అందులో ‘కుమ్మరి చక్రం’ మీద ‘కుల’ వివాదాన్ని సృష్టించే ప్రయత్నం చేశాయి కొన్ని రాజకీయ శక్తులు. ఇదీ సినిమాలపై ‘మనోభావాల’ పేరుతో జరుగుతున్న రాజకీయ దాడి.!
నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది మనోభావాల పేరుతో రొచ్చు రాజకీయం చేస్తున్నవారి తీరు.