‘అల్లరి’కి సిద్ధమైన రుహానీ శర్మ.!
Ruhani Sharma Allari.. రుహానీ శర్మ గుర్తుందా.? అదే, సుశాంత్ హీరోగా తెరకెక్కిన ‘చిలసౌ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైందీ బ్యూటీ.
ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించిందిగానీ, సరైన సక్సెస్ అయితే రుహానీ శర్మ (Ruhani Sharma) అందుకున్న దాఖలాల్లేవు.
కానీ, రుహానీ శర్మకి అవకాశాలైతే బాగానే వస్తున్నాయ్. తాజాగా, రుహానీ శర్మకి ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ వచ్చింది.
Ruhani Sharma Allari.. కీలకమైన పాత్రలో అనగానేమి.?
అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో రుహానీ శర్మకి (Ruhani Sharma) చోటు దక్కింది. కీలకమైన పాత్ర.. అని చెబుతున్నారు. అంటే, హీరోయిన్ రోల్ కాదా.?
మెహర్ తేజ్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా, సితార ఎంటర్టైన్మెంట్స్ – ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
రుహానీ శర్మ తెలుగుతోపాటు తమిళ, మళయాళ, హిందీ సినిమాల్లోనూ నటించింది. ‘డర్టీ హరి’, ‘ఆపరేషన్ వేలంటైన్’, ‘సైంధవ్’ తదితర తెలుగు సినిమాల్లో రుహానీ శర్మ నటించిన సంగతి తెలిసిందే.