RRR Movie HCA Awards.. జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన వెండితెర అద్భుతం ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలే కాదు, విమర్శకుల ప్రశంసలూ అందుకుంది.
జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులైతే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం పోటీ పడుతున్నాయని చెప్పక తప్పదేమో.
తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ‘ఆర్ఆర్ఆర్’ మోత మోగిపోతోంది. ‘బెస్ట్ యాక్షన్ ఫిలిం.. బెస్ట్ స్టంట్స్.. బెస్ట్ సాంగ్.. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం..’ ఇలా వివిధ కేటగిరీల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అవార్డులు దక్కించుకుంది.
కాగా, ఈ అవార్డుల ప్రదానోత్సవానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఓ ప్రెజెంటర్‌గా పాల్గొన్నాడు. ఈ క్రమంలో అమెరికన్ ఛానళ్ళు నిర్వహించిన పలు షోస్‌లో సందడి చేశాడు రామ్ చరణ్.
RRR Movie HCA Awards.. ఈ విజయం అందరిదీ: రాజమౌళి
అవార్డుల రేసులో రామ్ చరణ్ కూడా పోటీ పడుతున్నాడు.. సహ నటుడు ఎన్టీయార్‌తో కలిసి. ఇద్దరి మధ్యనా అవార్డుల విషయంలో కూడా పోటీ వుందనుకోండి.. అది వేరే సంగతి. ఇద్దరూ నామినేట్ అయ్యారు ఒకే కేటగిరీలో.
Also Read: అరెవో సాంబా.! ఓ స్పెషల్ సాంగ్ ఏస్కో.!
కాగా, బెస్ట్ యాక్షన్, బెస్ట్ స్టంట్స్.. ఇలా వివిధ కేటగిరీల్లో ‘ఆర్ఆర్ఆర్’ తరఫున అవార్డులు అందుకున్న రాజమౌళి, ‘ఈ ఘనత సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిదీ..’ అంటూ వేదికపై ప్రసంగించాడు.

‘ఆస్కార్’ వేదికపై ‘ఆర్ఆర్ఆర్’ కూడా పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఆ ఒక్కటీ వచ్చేస్తే.. ‘ఆర్ఆర్ఆర్’ అంతర్జాతీ విజయం సంపూర్ణం.. అనుకోవచ్చేమో.!