RRR Movie Ramcharan Vs NTR: వెండితెర అద్భుతం ‘ఆర్ఆర్ఆర్’ మేనియా ఏ స్థాయిలో వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్ వర్సెస్ ఎన్టీయార్.. అంటూ ఒకప్పుడు ఇరువురు అభిమానుల మధ్యా రచ్చ జరిగేది.
ఇప్పుడేమో, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Mega Power Star Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీయార్ (Young Tiger NTR).. ఇద్దరూ తాము అన్నదమ్ములమని అంటున్నారు. మంచి స్నేహితులమని చెబుతున్నారు. అయినా, సోషల్ మీడియాలో ‘వార్’ కొనసాగుతూనే వుంది. అయితే, గతంలోలా కాదు.. ఈసారి కాస్త భిన్నంగా.
RRR Movie Ramcharan Vs NTR.. సమ ఉజ్జీలు బాక్సాఫీస్ కదనరంగంలోకి దూకాయ్.!
వెండితెరపై రెండు కొదమ సింహాలు పోటీ పడితే ఎలా వుంటుంది.? అది తెలియాలంటే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూడాల్సిందే. ‘నాటు నాటు..’ పాటలో చరణ్, ఎన్టీయార్ ఎలా పోటీ పడి డాన్సులేశారో చూశాం. అంతేనా, సినిమా ప్రోమోల్లో చరణ్, ఎన్టీయార్ చేసిన హంగామా చూస్తున్నాం.
జక్కన్న రాజమౌళి అంటేనే, గ్రాండియర్ లుక్‌కి కేరాఫ్ అడ్రస్. తన సినిమాల్లో ఆ గ్రాండియర్ వుండేలా చూసుకుంటాడాయన. ‘బాహుబలి’ తర్వాత అంతకు మించి.. అనే స్థాయిలో ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) వుండబోతోందన్నది నిస్సందేహం, నిర్వివాదాంశం.

‘తొక్కుకుంటూ పోవాలే..’ అంటూ యంగ్ టైగర్ ఎన్టీయార్ అభిమానులు, అదే నినాదంతో రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. మార్చి 25న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
రాజమౌళి అంటేనే క్వాలిటీ.! కాన్ఫిడెన్స్.!
కోవిడ్ కొంతమేర ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ఇబ్బంది పెట్టినా, రాజమౌళి (SS Rajamouli) ఎక్కడా క్వాలిటీ విషయంలో రాజీపడలేదు. ఆ విషయంలో ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) ప్రోమోస్ చూస్తే అర్థమవుతుంది. ఇంతకీ, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్ వర్సెస్ జూనియర్ ఎన్టీయార్.. ఆ ఫైట్ ఎలా వుండబోతోంది.?
ఖచ్చితంగా ఇద్దరి మధ్యా (Ram Charan And Jr NTR) యుద్ధం వుంటుంది.. ఆ యుద్ధమొక్కటే కాదు, అంతకు మించిన అద్భుతమైన స్నేహాన్ని కూడా ఇద్దరి మధ్యా దర్శకుడు రాజమౌళి చూపించబోతున్నాడు. అందుకే, ఇద్దరు సమ ఉజ్జీలు తెరపై తలపడుతోంటే, చూసే ప్రేక్షకులకి ఒకింత బాధ కలుగుతుందట.
Also Read: ’సాహో‘కి అలా అన్నారు.! ‘రాధేశ్యామ్’కి ఎలా అంటున్నారంటే.!
‘బాహుబలి’ (Baahubali)తో తెలుగు సినిమా స్థాయి అంతర్జాతీయ స్థాయికి పెరగడంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్న రాజమౌళి, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఇంకెలాంటి సంచలనాలకు తెరలేపుతాడో.. చరణ్, ఎన్టీయార్ కాంబో బాక్సాఫీస్ వద్ద సృష్టించబోయే వసూళ్ళ విధ్వంసమెలా వుండబోతోందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే మరి.!