RRR Movie Resul Pookutty.. టాలెంట్ ఎక్కువైపోతే, కొంతమందికి బుర్ర పనిచెయ్యదు. తమ స్థాయి ఏంటో కూడా మర్చిపోతుంటారు. ‘అంతా నా ఇష్టం’ అనుకునే వింత జీవులు సినీ పరిశ్రమలోనూ సంచరిస్తుంటారు.
అలాంటి వింత జీవుల కేటగిరీకే చెందుతాడేమో ప్రముఖ సౌండ్ డిజైనర్, సౌండ్ ఎడిటర్ మరియు ఆడియో మిక్సర్ రేసుల్ పూకుట్టీ. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’తో ప్రపంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నాడు రేసుల్.
మొన్నీమధ్యనే, ‘పుష్ప’, ‘రాధేశ్యామ్’ సినిమాలకు కూడా రేసుల్ పూకుట్టీ పని చేసిన సంగతి తెలిసిందే.
అలా‘గే’ ఎందుకు అనిపించిందో మరి.!
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన వెండితెర అద్భుతం ‘ఆర్ఆర్ఆర్’కి ప్రపంచ వ్యాప్త గుర్తింపు దక్కింది. వివిధ దేశాల్లో సినీ ప్రముఖులు, జర్నలిస్టులు, సామాన్యులు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే వున్నారు.

కానీ, దాన్ని జీర్ణించుకోలేని కొన్ని జీవులు కూడా వున్నాయ్. అందుకే, వాళ్ళకి అన్నదమ్ముల అనుబంధం కాస్తా ‘గే లవ్ స్టోరీ’ అనిపించింది.
ఈ పైత్యపు లిస్టులో తొలి పేరు మన తెలుగు సినీ ప్రముఖుడిదే. పేరు రాయడం కూడా దండగ వ్యవహారం. అప్పుడెప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం సంచలన దర్శకుడతడు.
RRR Movie Resul Pookutty.. ఏం పైత్యం ఆవహించిందని.?
ఇప్పుడు రేసుల్ పూకుట్టీ కూడా, బహుశా ఏదో వక్రకోణంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసినట్టున్నాడు. సోకాల్డ్ తేడాగాళ్ళలా‘గే’, మనోడిదీ తేడా వ్యవహారమే అయి వుండాలి. అందుకే, తేడాగా కనిపించింది.
ఏదో ఆంగ్ల పత్రికలో ‘తేడా’ కథనం వచ్చిందంటూ, ఒక్కసారిగా వీళ్ళంతా ఎందుకు ‘తేడాగాళ్ళు’ అయిపోతున్నారో ఎవరికీ అర్థం కావడంలేదు. ఇదెక్కడి పంచాయితీ.?
Also Read: విజయ్ ‘లైగర్’.! సాలా క్రాస్ బ్రీడ్.! కానీ, ఇలా..గే.! ఎందుకు.?
మన ఇండియన్ సినిమాలో ఇన్ని చీడపురుగులున్నాయా.? ఇండియన్ సినిమా స్థాయిని పెంచినోళ్ళుగా గర్తింపు తెచ్చుకున్నోళ్ళే, ఆ ఇండియన్ సినిమాని ఎందుకు చంపేయాలనుకుంటున్నారు.?
ఏమో, ఎవరి పైత్యం వాళ్ళది.. అనుకుంటే సరి.!