RRR Movie Tammareddy Bharadwaja ఎవరో తమ్మారెడ్డి భరద్వాజ అట.! ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ‘ఆస్కార్’ కోసం 80 కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ ఆరోపించేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
ఇంతకీ, ఎవరీ తమ్మారెడ్డి భరద్వాజ.? సీనియర్ దర్శక నిర్మాత ఆయన. పరిశ్రమ పెద్దలు.. అనదగ్గవారిలో ఈయన పేరు కూడా వినిపిస్తుంటుంది.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా మీద తమ్మారెడ్డి భరద్వాజకి అక్కసు ఎందుకు.?
Mudra369
ఇంకో తెలుగు సినిమా ‘ఆస్కార్’ వేదిక మీదకు వెళ్ళేందుకు ఎన్నేళ్ళు పడుతుందో.!
గర్వపడటం చేతకాకపోతే.. లోలోపల కుళ్ళుకుని ఏడవాలి తప్ప.. బహిరంగంగా వొర్లితే ప్రయోజనమేంటి.? నలుగురూ నవ్విపోతారని తెలియదా.?
అన్నట్టు, ‘పెద్దరికం’ ప్రదర్శించి ఏ సమస్యని తీర్చినట్లు.? ఎవరికి సాయం చేసినట్లు.? అనడగొద్దు.. అదంతే.! నిజమేనా.? ‘ఆస్కార్’ కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ 80 కోట్లు ఖర్చు చేస్తోందా.?
RRR Movie Tammareddy Bharadwaja.. తియ్.. ఎవడొద్దన్నాడు.?
ఆ ఎనభై కోట్లతో పది సినిమాలు తీసి మొహాన కొడతామంటూ తేలిక వ్యాఖ్యలు చేశారు తమ్మారెడ్డి భరద్వాజ. ఎనభై కోట్లు కాదు.. ఎనిమిది కోట్లు ఇస్తే.. ఓ ఎనిమిది పది చిన్న సినిమాలు తీసి మొహాన కొడతామనేవాళ్ళూ లేకపోలేదు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి చాలా బడ్జెట్ అయ్యింది. ఒక్కో సినిమాకీ ఒక్కోలా ఖర్చవుతుంది. ఖర్చు చేస్తే సినిమాలు హిట్టయిపోవు. సినిమాలో కంటెంట్ వుండాలి. కంటెంట్‌కి తగ్గట్టుగా ఖర్చవుతుంటుంది.

ఇక, అంతర్జాతీయ స్థాయిలో ‘ఆర్ఆర్ఆర్’కి దక్కుతున్న గౌరవం దరిమిలా, ఇండియన్ సినిమాని ప్రమోట్ చేసుకునే అవకావం దొరుకుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ అదే చేస్తోంది.
గర్వపడు.. లేదంటే, ఇంట్లో కూర్చో..
‘ఆస్కార్’ వేదికపై ‘ఆర్ఆర్ఆర్’ గురించి చర్చించుకోవడమంటే చిన్న విషయం కాదు. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వచ్చేలా వుంది కూడా.!
Also Read: కొరటాల ఔట్.! వంగా? అల్లు.. గుచ్చేస్తున్న ‘పబ్లిసిటీ’ ముల్లు.!
ఈ తరుణంలో తెలుగు సినీ ప్రముఖుడిగా తమ్మారెడ్డి భరద్వాజ గర్వపడాలి. లేదంటే, సైలెంటుగా ఇంట్లో కూర్చుని కుళ్ళుకోవాలి. కానీ, బయటకొచ్చి అక్కసు ప్రదర్శిస్తే ఎలా.?
80 కోట్లు ఖర్చు చేస్తున్నారు.. అనే విమర్శ వెనుక, 80 కోట్లతో ఆస్కార్ కొనుక్కుంటున్నారనే ఆరోపణ వున్నట్టే కదా.? ఇదీ తమ్మారెడ్డి భరద్వాజ స్థాయి.!