RRR Ramudu Ram Charan: అది ‘జంజీర్’ సినిమా నాటి సందర్భం. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి చేసినట్టే తాను కూడా బాలీవుడ్‌లో ఓ సినిమా చేయాలనుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆ దిశగా ఓ ప్రయత్నం గట్టిగానే చేశాడు.
సినీ రంగంలో విజయాలు, పరాజయాలు సర్వసాధారణం. ‘జంజీర్’ సినిమా ఫ్లాప్ అవడంతో, బాలీవుడ్ మీడియా రామ్‌చరణ్‌ని ఏకి పారేసింది.
రామ్‌చరణ్ రూపాన్ని సైతం గేలి చేసింది. అత్యంత జుగుప్సాకరమైన రీతిలో ‘జంజీర్’ సినిమా సమయంలో చరణ్ మీద దిక్కుమాలిన కామెంట్స్ పడ్డాయ్.!
వెక్కిరించిన నోళ్ళే ప్రశంసిస్తున్నాయ్.!
‘నువ్వు ఏ చేత్తో అయితే చెత్త రాతలు రాశావో.. అదే చేత్తో నా గురించి గొప్పగా రాసే రోజులొస్తాయ్..’ అని ‘జంజీర్’ సినిమాలో ఓ డైలాగ్ వుంటుంది.. అదీ హీరో చెప్పే డైలాగ్ కావడం గమనార్హం. ఆ డైలాగ్ నిజ జీవితంలోనూ నిజమయ్యింది.

‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) సినిమా వచ్చింది.. పాన్ ఇండియా స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. రాజమౌళి గొప్పతనం గురించి కీర్తించడం ఓ యెత్తు.. రామ్ చరణ్ నటనా ప్రతిభ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం ఇంకో యెత్తు.
పడిలేచిన కెరటం.. అంటున్నారు కొందరు. దేశం గర్వించదగ్గ నటుడు.. అంటున్నారు ఇంకొందరు.
ఓ తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) తన కుమారుడ్ని చూసి గర్వపడటానికి ఇంతకన్నా అద్భుతమైన విషయం ఇంకేముంటుంది.?
RRR Ramudu Ram Charan.. ఉత్తరాది సినీ రాముడు.!
ఎక్కడైతే విమర్శలు ఎదుర్కొన్నాడో, అక్కడే రామ్ చరణ్ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఆషామాషీ వ్యవహారం కాదిది. ఇంకా ఆసక్తికరమైన విషయమేంటంటే, మొత్తం నార్త్ ఇండియా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ని వెండితెర రాముడిగా చూస్తోంది.
నిజానికి, ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు తరహా గెటప్‌లో కనిపిస్తాడు రామ్ చరణ్. కానీ, అది నార్త్ ఇండియన్స్‌కి రాముడి పాత్రలా కనిపించింది.
Also Read: Pawan Kalyan హీరోయిజంపై ఎందుకీ ‘ఏడుపు’.!
‘రామం..’ అంటూ సాగే పాటని ఈ సినిమా కోసం రూపొందించడం.. ఆ పాటలోని రాముడితో చరణ్‌ని (Mega Power Star Ram Charan) పోల్చి చూపిస్తూ సన్నివేశాల్ని రాజమౌళి (SS Rajamouli) డిజైన్ చేయడమూ ఓ కారణం కావొచ్చు.