RRR Telugu Review: ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజ్ చేయగలిగే సత్తా వున్న హీరోలు.. బాక్సాఫీస్ వద్ద తమ సినిమాలతో తేలిగ్గా వంద కోట్లు రాబట్టగల మాస్ స్టామినా వున్న కథానాయకులు. మూడేళ్ళకో, నాలుగేళ్ళకో, ఐదేళ్ళకో ఓ సినిమా తీసినా, దేశం దృష్టినే కాదు.. ప్రపంచం దృష్టిని ఆకర్షించగల దర్శకుడు.!
ఇవన్నీ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Mega Power Star Ram Charan), యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీయార్ (Young Tiger NTR), జక్కన్న రాజమౌళి (Jakkanna Rajamouli) గురించే. అసలు ఈ కాంబినేషన్‌ని జక్కన్న ఎలా సెట్ చేయగలిగాడన్నది ఇప్పటికీ మిస్టరీనే.
‘మేమిద్దరం చాలా మంచి స్నేహితులం. అది చాలా తక్కువమందికే తెలుసు. జక్కన్న ఎందుకు మా ఇద్దరినీ కలిపాడో ఏమోగానీ.. ఇదొక వెండితెర అద్భుతం కాబోతోంది..’ అంటూ అటు రామ్ చరణ్, ఇటు ఎన్టీయార్ చెప్పుకొచ్చారు.
RRR Telugu Review: ఇంతకీ, ‘ఆర్ఆర్ఆర్’ కథా కమామిషు ఏంటి.?
అది స్వాతంత్ర్యానికి ముందు జరిగే కథ. ఇది కల్పిత కథ మాత్రమేనని దర్శకుడు రాజమౌళి పదే పదే చెబుతూ వస్తున్నాడు.

తెలంగాణ నేలపై జన్మించిన గిరిజన నాయకుడు కొమరం భీమ్, ఆంధ్ర గడ్డపై జన్మించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు.. ఈ ఇద్దరి మనస్తత్వాలతో కూడిన పాత్రలు, వాటి మధ్య సంఘర్షణ, ఆ ఇద్దరి మధ్య స్నేహం.. ఇవన్నీ ‘ఆర్ఆర్ఆర్’లో రాజమౌళి చూపించాడు.
Also Read: గ్యాస్ ట్యాంకర్ అట.! ప్చ్.. Raashi Khanna కూడా అంతే.!
యంగ్ టైగర్ ఎన్టీయార్ ఇంట్రో సీన్ చూశాక, రాజమౌళికి మాత్రమే ఇలాంటి ‘హై మూమెంట్స్’ డిజైన్ చేయాలని ఎందుకు అనిపిస్తుంటుంది.? అన్న ఆశ్చర్యం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది.
ప్రతి ఫ్రేమ్ నిండుగా కనిపిస్తోంది.. అత్యద్భుతంగా సన్నివేశాల్ని రాజమౌళి తెరకెక్కించాడు.
బ్రిటిష్ హయాంలో పోలీస్ అధికారిగా రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్ టాప్ క్లాస్. నటుడిగా రామ్ చరణ్ గురించి పదే పదే సినిమా ప్రమోషన్లలో దర్శకుడు రాజమౌళి ఎందుకు చెప్పాడో సినిమా చూస్తే అర్థమవుతుంది.
చరణ్ – ఎన్టీయార్ కాంబినేషన్ సీన్స్ సింప్లీ సూపర్బ్. తెరపై ఇద్దరు మాస్ హీరోలు తమదైన స్టయిల్లో చెలరేగిపోతోంటే.. ఆయా హీరోల అభిమానులకే కాదు, సగటు సినీ అభిమానులకీ పండగే కదా.!
పాటల చిత్రీకరణ, యాక్షన్ ఎపిసోడ్స్.. ఎమోషనల్ సీన్స్.. వాట్ నాట్.. అటు నటీనటులు, ఇటు దర్శకుడి మేకింగ్.. వెరసి ఒకరితో ఒకరు పోటీ పడ్డట్టుంది.
లైవ్ అప్‌డేట్స్ మరియు.. పూర్తి రివ్యూ కోసం ఈ పేజీని చూస్తుండండి.!