Rukmini Vasanth Kanakavathi Kantara.. దేవసేన అంటే సుపరిచితమే.. ‘బాహుబలి’ సినిమాలో అనుష్క పోషించిన పాత్ర పేరే దేవసేన.
ఆ దేవసేన పాత్రకీ.. ‘బాహుమలి’ సినిమాలో ఆ పాత్ర పోషించిన అనుష్కకీ ఏ స్థాయిలో పేరొచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
మరి, ‘కనకవతి’.. ఎవరీ ‘కనకవతి’. రీసెంట్‌గా రిలీజ్ అయిన ‘కాంతార ఛాప్టర్ 1’ సినిమాలో హీరోయిన్ రుక్మిణీ వసంత్ పోషించిన పాత్ర పేరే ‘కనకవతి’.
ఇప్పుడీ పేరు ట్రెండింగ్ అవుతోంది. అలాగే, ఆ పాత్ర పోషించిన రుక్మిణీ వసంత్ కూడా. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లో నటించింది.
Rukmini Vasanth Kanakavathi Kantara.. కనకవతి మ్యాజిక్కే అంతా.!
‘సప్త సాగరాలు దాటి’.. అనే సినిమాతో పరిచయమైంది రుక్మిణీ వసంత్. డెబ్యూ మూవీ అయినప్పటికీ ఈ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది.
ఆ పాపులారిటీతోనే అరడజనుకు పైగా ప్రాజెక్టులు పట్టింది. తెలుగుతో పాటూ తమిళ, కన్నడ భాషల్లో. కానీ, అందులో ఏ ఒక్కటీ రుక్మిణీ వసంత్ పాపులారిటీని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లింది లేదు.
కానీ, ‘కాంతార ఛాప్టర్ 1’ సినిమా రుక్మిణి కెరీర్‌ని టర్న్ చేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆమె పోషించిన ‘కనవకతి’ పాత్ర. మంచి స్కోపున్న పాత్ర ఇది.
ఏకంగా అనుష్క ‘బాహుబలి’లో చేసిన దేవనసేన పాత్రతో పోల్చుతున్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు ఆ పాత్రలోని డెప్త్ ఏంటో.
ముందున్నదంతా పూల దారే.!
దాంతో, అమాంతం అమ్మడి రేంజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ట్రెండింగ్ బ్యూటీ అయిపోయింది రుక్మిణీ వసంత్. అసలే తదుపరి ఆమె చేతిలో వున్నవి ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు.
అందులో జూనియర్ ఎన్టీయార్‌తో ‘డ్రాగన్’ సినిమా వుండడం విశేషం. ఎన్టీయార్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది.
Also Read: నడుముకి నగ.! రేపుతోంది సెగ.!
‘కాంతార ఛాప్టర్ 1’ సినిమాతో వచ్చిన ఫేమ్‌తో ఈ సినిమాపై రుక్మిణీ క్యారెక్టర్‌పై అంచనాలు మరింత పెరిగాయ్.
అలాగే, ‘కేజీఎఫ్’ హీరో యష్‌తో కన్నడలోనూ రుక్మిణీ వసంత్ నటిస్తోంది. ‘టాక్సిక్’ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమా కూడా రుక్మిణీ వసంత్‌కి మరో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కానుంది.
