Rukmini Vasanth Telugu Cinema.. వెండితెరపైకి సరికొత్తగా అందాల భామలు వస్తూనే వుంటారు. నటనతో మెప్పిస్తారు కొందరు, గ్లామర్‌కే పరిమితమవుతారు ఇంకొందరు.
సింగిల్ సినిమా వండర్స్ కొందరు.. తొలి సినిమా డిజాస్టర్ అయినా, స్టార్లు అయినవారు ఇంకొందరు. గ్లామర్ ప్రపంచం.. అనబడే సినీ రంగంలో, వింతలెన్నో.!
అలా, తెలుగు తెరపై కొన్నాళ్ళ క్రితం మెరిసింది రుక్మిణీ వసంత్. నిఖిల్ సిద్దార్ధ హీరోగా నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాలో నటించిందామె.
Rukmini Vasanth Telugu Cinema.. తొలి సినిమా డిజాస్టర్..
‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా ఎప్పుడొచ్చిందో కూడా ఎవరికీ తెలియదు. అంత పెద్ద డిజాస్టర్ అది. నిజానికి, ఆ సినిమా ప్రమోషన్లని నటీనటులెవరూ పట్టించుకోలేదు కూడా.
Also Read: తొలగిస్తే, ‘బంధం’ తెగిపోయినట్లే..నా!?
రుక్మిణీ వసంత్, ‘సప్త సాగరాలు దాటి’ అనే సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఓటీటీలో ఈ సినిమాకి ఫ్యాన్స్ చాలామందే వున్నారు ఇప్పటికీ.
కన్నడ నుంచి తెలుగులోకి వచ్చిన సినిమా ‘సప్త సాగరాలు దాటి’. ‘పార్ట్-ఎ’, ‘పార్ట్-బి’ అంటూ రెండు భాగాలుగా సినిమాని విడుదల చేశారు.
జూనియర్ ఎన్టీయార్ సరసన..
కన్నడ హీరో యష్ సరసన ఓ సినిమా చేస్తోంది రుక్మిణీ వసంత్. జూనియర్ ఎన్టీయార్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమాలోనూ రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది.
సంచలన విజయాన్ని అందుకున్న ‘కాంతర’ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ‘కాంతార-2’లో కూడా రుక్మిణీ వసంత్ హీరోయిన్.
తాజాగా, ‘మదరాసి’ సినిమా ప్రమోషన్ల కోసం తెలుగునాట సందడి చేస్తోంది రుక్మిణీ వసంత్. తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన సినిమా ఇది.

జూనియర్ ఎన్టీయార్ గురించి చెప్పమంటే, ఒక్కమాటలో చెప్పలేను.. ఆయనొక డిక్షనరీ.. అంటూ, రుక్మిణీ వసంత్ వ్యాఖ్యానించడం గమనార్హం.
అందం, అభినయం.. అన్నీ కలగలిసిన రుక్మిణీ వసంత్, తెలుగు తెరపై స్టార్ హీరోయిన్‌గా నిలదొక్కుకుంటుందా.? వేచి చూడాల్సిందే.