Table of Contents
ఎప్పుడెప్పుడా అని మొత్తం భారతీయ సినీ ప్రపంచం ఎదురు చూస్తున్నారు ‘సాహో’ (Saaho) కోసం. అందరి అంచనాల్ని మించేలా ‘సాహో’ (Saaho Teaser Rajamouli Review) టీజర్ వచ్చేసింది. అంచనాలకు మించి అన్నట్లుగా ఈ టీజర్‌ని కట్ చేశారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో యంగ్ డైరెక్టర్ సుజిత్ (Sujeeth) ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. న భూతో న భవిష్యతి.. అనే స్థాయిలో సినిమా కోసం పనిచేస్తోంది ఓ పెద్ద టీమ్.. అదీ పూర్తి నిబద్ధతతో.
అందరి చేతా ‘డార్లింగ్’ అని పిలిపించుకునే ప్రబాస్‌కి (Young Rebel Star Prabhas) ‘సాహో’ మరో బ్లాక్ బస్టర్ అవుతుందనడం నిస్సందేహం అని తేలిపోయింది (Saaho Teaser Rajamouli Review) టీజర్ చూశాక. అందుకే సగటు సినీ ప్రేక్షకుడు మాత్రమే కాదు, సినీ ప్రముఖులంతా ‘సాహో’ టీజర్‌ని పొగిడి పొగిడి వదిలిపెడుతున్నారు.
ఇప్పుడు ఎక్కడ విన్నా సాహో మేనియానే.. ఆ స్థాయిలో ప్రభాస్ తన సత్తా చాటుతున్నాడు సాహో టీజర్ విడుదల కారణంగా. టాలీవుడ్, కోలీవుడ్.. బాలీవుడ్.. ఇలా అన్ని సినీ పరిశ్రమల్లోనూ సాహో పేరు రీ-సౌండ్ వచ్చేస్తోందంటే అతిశయోక్తి కాదేమో.
సాహోరే.. అంటున్న రాజమౌళి.. Saaho Teaser Rajamouli Review
దర్శక ధీరుడు, తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాపితం చేసిన టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఏకంగా ‘సాహో’ టీజర్‌కి చిన్నపాటి రివ్యూనే రాసేశారు.
యూవీ క్రియేషన్స్ తాము పెట్టిన బడ్జెట్‌కి న్యాయం చేసింది ‘సాహో’ టీజర్. ‘బాహుబలి’ వంటి సినిమాలో నటించాక కూడా రెండో సినిమాకే ప్రబాస్‌తో కలిసి పని చేసే అవకాశం వచ్చిన డైరెక్టర్ సుజిత్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక డార్లింగ్ సంగతి చెప్పనే అక్కర్లేదు.
‘బాహుబలి’లా కండలతో కనిపించి ప్రపంచ ఖ్యాతి పొందిన ప్రబాస్ ఇప్పుడు మళ్లీ డార్లింగ్ అవతారమెత్తేశాడు. హ్యాండ్‌సమ్ లుక్స్‌తో అసలు సిసలు హీరోయిజం చూపిస్తున్నాడు.. ‘సాహో’ టీజర్ అద్భుతంగా ఉంది.. ఇదీ రాజమౌళి రివ్యూ సారాంశం.
రాజమౌళి (SS Rajamouli) ‘సాహో’ యూనిట్‌ని ప్రశంసిస్తూ, టీజర్‌కి రివ్యూ ఇచ్చేసరికి రెబల్ స్టార్ అభిమానులు అతన్ని ఆకాశానికెత్తేశారు. ప్రబాస్‌తో రాజమౌళికి మంచి అనుబంధం ఉంది. ‘బాహుబలి’ కోసం ఏ హీరో చేయని సాహసం చేశాడు ప్రబాస్.
ఏకంగా తన కెరీర్‌లో ఐదేళ్లు ఈ సినిమా కోసం కేటాయించేశాడు. అందుకే రాజమౌళికి ప్రబాస్ అంటే ప్రత్యేకమైన అభిమానం. అంతకు ముందే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఛత్రపతి’ ఓ బ్లాక్ బస్టర్ ఉన్న సంగతి తెలిసిందే.
రాజమౌళి మాత్రమే కాదు.. సినీ పరిశ్రమలో అందరిదీ అదే మాట..
ఇక రాజమౌళితో పాటు, యావత్ తెలుగు సినీ లోకం ‘సాహో’ టీజర్‌ని ప్రశంసలతో ముంచెత్తేసింది. డైరెక్టర్ సురేందర్ రెడ్డి (Director Surender Reddy – Sye Raa Narasimha Reddy) ‘సాహో’ టీజర్ ఫెంటాస్టిక్‌గా ఉంది.. అంటూ టీమ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. భళ్లాలదేవుడు రానా (Rana Daggubati) టీజర్ సూపర్బ్‌గా ఉంది, సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానన్నారు.
‘ట్రెండ్ సృష్టిస్తున్నారంటూ..’ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ‘సాహో’ టీజర్ గురించి తనదైన శైలిలో స్పందించారు. ‘బాబోయ్.. ఆ టీజర్ ఏంటీ.? బ్రిలియంట్.. చూడబోతే ‘సాహో’తో మరోసారి ప్రబాస్ ఏదో అద్భుతం సృష్టించేసేలానే ఉన్నాడు.. అని మంచు విష్ణు (Manchu Vishnu) స్పందించాడు.
తెలుగు సినిమా నుండి రాబోతున్న మరో అద్భుతం.. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ గెట్ రెడీ ఫర్ ఇండియా.. అంటూ అల్లు శిరీష్ (Allu Sirish) స్పందించాడు. ‘దిమ్మ తిరిగిపోయింది’ రెండో సినిమాకే డైరెక్టర్ సుజిత్‌లో ఇంత అద్భుతమైన డెవలప్‌మెంటా.? అని హీరో సిద్దార్ద్ ఆశ్చర్యపోయారు.
ఇలాంటి స్టఫ్ ఇస్తే ఫ్యాన్సే కాదు, ప్రతీ సినీ ప్రేమికుడూ డై హార్డ్ ఫ్యానే.. అని తనదైన శైలిలో డైరెక్టర్ మారుతి రెస్పాండ్ అయ్యాడు. వీరే కాదు, నితిన్, తమన్నా, శర్వానంద్, అడవిశేష్, బెల్లంకొండ శ్రీనివాస్, పూరీ జగన్నాధ్ తదితర సినీ ప్రముఖులు ‘సాహో’ టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ ఇచ్చారు.
వ్యూస్ పోటెత్తుతున్నాయ్.. కామెంట్స్ ముంచెత్తుతున్నాయ్..
ఇక యూట్యూబ్ వేదికగా ‘సాహో’ టీజర్ కి వ్యూస్ పోటెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో పోస్టింగ్స్ సునామీలా కనిపిస్తున్నాయి. విడుదలైన కొన్ని నిముషాల నుండే రికార్డు వ్యూస్ దక్కించుకుంటూ సోషల్ మీడియా ట్రెండ్స్‌లో మొదటి స్థానంలో ఉంది ‘సాహో’ టీజర్ (Saaho Teaser).
మొత్తానికి ఊహించిన దానికన్నా ఎక్కువ ఆశ్చర్యపరిచేలా, సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేలా.. అత్యద్భుతంగా రూపొందిన ‘సాహో’ టీజర్ సాధారణ సినీ ప్రేక్షకులకి మాత్రమే కాదు.. ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు, సినీ ప్రముఖులందరికీ స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చిందన్నమాట.
టీజర్ సంచలనాలే ఇలా వుంటే, ట్రైలర్ (Saaho Trailer) సంగతేంటి.? ఆ ట్రైలర్ తెచ్చే సునామీ ఇంకెలా వుండబోతోంది.? వెండితెరపై ఈ సాంకేతిక అద్భుతం చూస్తే.. ఇంకేమన్నా వుందా.. ఆ మాగ్నమ్ ఓపస్ (Magnum Opus Saaho) చూసేందుకు ‘సాహోరే’ అంటూ సంసిద్ధమైపోదామా మరి.