Sai Dharam Tej Accident సినీ నటుడు నరేష్ ప్రస్తుతం ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఓ సినీ నటుడు రోడ్డు ప్రమాదానికి గురైతే, బాధితుడైన సినీ నటుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాలి. నరేష్ ఆ విషయంలో కాస్త పద్ధతిగానే వ్యవహరించారు. కానీ, కొన్ని అనవసర ప్రస్తావనలు తీసుకొచ్చి వివాదాల్లోకెక్కారయన.
‘నేను కూడా ఒకప్పుడ బైక్ రైడర్‌నే. నాకూ బైక్ రైడింగ్ ఇష్టం. యాక్సిడెంట్ జరిగిన బైక్.. 1000 సీసీ వరకు వుంటుంది. అలాంటిది నేనెప్పుడూ రైడ్ చేయలేదు.. మా అబ్బాయిదీ అలాంటిదే.. దాన్ని నేను ఓ సారి రైడ్ చేశాను..’ అంటూ చిత్ర విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు నరేష్. ఇప్పుడా ప్రస్తావన ఎందుకు.?
ఏమైపోయింది ఆ పెద్దరికం.?
అక్కడితో ఆగలేదు నరేష్.. గతంలో కోట శ్రీనివాసరావు తనయుడు.. బాబూమోహన్ తనయుడు.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ప్రస్తావించారు. అక్కడ, సాయి ధరమ్ తేజ్.. రోడ్డు ప్రమాదానికి గురై.. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో బైక్ యాక్సిడెంట్ల వల్ల మరణించినవారి ప్రస్తావన ఎందుకు.?
నరేష్ అంటే సీనియర్ నటుడు. అటు సినిమా కెరీర్ పరంగా చూసుకున్నా.. వ్యక్తిగత జీవితం పరంగా చూసుకున్నా ఎన్నో ఎత్తుపల్లాల్ని చవిచూసి వుంటారాయన. అలాంటి వ్యక్తి.. ‘మా’ అధ్యక్షుడి హోదాలో అయినా, సీనియర్ నటుడి హోదాలో అయినా.. ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యలా చేసేది.?
ఇలాగేనా Sai Dharam Tej Accident మీద మాట్లాడేది.?
పైగా, నరేష్ కుమారుడు నవీన్.. సాయి ధరమ్ తేజ్‌కి అత్యంత సన్నిహితుడు. నిజానికి, ప్రాణ స్నేహితులు నవీన్, సాయి. ‘నా కొడుకు లాంటివాడు..’ అంటూ సాయిధరమ్ తేజ్ గురించి ప్రస్తావిస్తూనే, బైక్ యాక్సిడెంట్ల వల్ల జరిగిన మరణాల్ని ప్రస్తావించడమేంటి.? అసలు నవీన్ ఎక్కడ.? నవీన్, సాయి ధరమ్ తేజ్.. కలిసే వెళ్ళారని నరేష్ చెప్పిన విషయాన్ని ఎలా పరిగణనలోకి తీసుకోవాలి.?
Also Read: రుధిర జర్నలిజం: బైక్ స్పీడు గంటకి 400 కిలోమీటర్లు.!
నరేష్ వ్యాఖ్యల పట్ల తీవ్ర దుమారమే రేగుతోంది. బండ్ల గణేష్, శ్రీకాంత్ తదితరులు నరేష్ మీద మండిపడ్డారు. ఈ సమయంలో కాస్త సంయమనంతో మాట్లాడాలని సూచించారు. నిర్మాత నట్టి కుమార్ కూడా నరేష్ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
వివాదం పెద్దదవుతుండడంతో నరేష్ వివరణ ఇచ్చుకున్నారు. ‘సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej Accident) అంటే మా కుటుంబ సభ్యుడి లాంటివాడే.. అందుకే ఆవేదనతో అలా మాట్లాడా..’ అని వివరణ ఇచ్చుకోవాల్సింది నరేష్‌కి.