Sai Dharam Tej Health.. రోడ్డు ప్రమాదానికి గురయ్యాక, చాలా రోజులపాటు సాయి ధరమ్ తేజ్ ఎందుకు బయటకు రాలేకపోయాడు.? ఈ ప్రశ్న చాలామంది మెగాభిమానుల్ని వేధించింది.
తొలుత చిన్న ప్రమాదమేనన్నారు. కానీ, చాలా ఎక్కువ రోజులే ఆసుపత్రిలో వుండాల్సి వచ్చింది సాయి ధరమ్ తేజ్. చిన్నపాటి సర్జరీలు జరిగాయి. ఎలాగైతేనేం, కోలుకున్నాడు. క్షేమంగా ఇంటికి వచ్చాడు.
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన పలు కార్యక్రమాలకు సాయి ధరమ్ తేజ్ హాజరవుతున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలూ బయటకు వస్తున్నాయి.
Sai Dharam Tej Health.. సాయి ధరమ్ తేజ్ కనిపించినా అంతే.!
సాయి ధరమ్ తేజ్ స్వయంగా ఓ వీడియో కూడా విడుదల చేశాడు తాను క్షేమంగానే వున్నానని. అయినాగానీ, సాయిధరమ్ తేజ్ గురించి బోల్డన్ని అనుమానాలు ప్రచారంలోకి వచ్చాయి. రకరకాల రూమర్లూ పుట్టించేశారు.
‘ఏదో అయ్యింది.. లేకపోతే, సాయి ధరమ్ తేజ్ మీడియా ముందుకు ఎందుకు రావడంలేదు.?’ అన్న ప్రశ్న సహజంగానే కొంతమందిని అయోమయానికి గురిచేసింది.

ఇంకోపక్క, సాయిధరమ్ తేజ్ బెజవాడ కనకదుర్గమ్మగుడిలో ప్రత్యేక పూజలకూ హాజరయ్యాడు. అయినా, సాయిధరమ్ తేజ్ మీద దుష్ప్రచారం జరుగుతూనే వుంది.
మెగా హీరో కదా.! ఆయనపై ఏడుపు కామన్.!
చివరికి, సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా షూటింగ్ జరుగుతున్నా, ఈ సుప్రీం అసలు ఇప్పుడు ఎలా వున్నాడు.? పూర్తి ఆరోగ్యంతో వున్నాడా.? లేదా.? అన్న అనుమానాల్ని ప్రచారం చేస్తూనే వచ్చారు.
Also Read: తమన్నా తకధిమితోం.! ఫన్ లేదు, ఓన్లీ ఫ్రస్ట్రేషన్.!
తాజాగా, సాయి ధరమ్ తేజ్ మీడియా ముందుకొచ్చేశాడు. తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్నాడు. నటీనటులు వైష్ణవ్, శ్రీలీలపై తొలి క్లాప్ కొట్టాడు కూడా.
సాయి ధరమ్ తేజ్ ఫిట్‌గానే వున్నాడు. నవ్వుతూనే కనిపించాడు. మునుపటి ఛార్మ్ సంతరించుకున్నాడు. చాలా చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు.
ఇకనైనా, సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై పుకార్లు ఆగుతాయా.? మెగా కాంపౌండ్ హీరో కాబట్టి, సాయిధరమ్ తేజ్ మీద ఏడుపు సహజంగానే కొనసాగుతుందా.? వేచి చూడాల్సిందే.
అన్నట్టు, పంజా వైష్ణవ్ తేజ్ తాజా చిత్రానికి శ్రీకాంత్ రెడ్డి దర్శకుడు. మాస్.. ఊరమాస్ అవతార్‌లో వైష్ణవ్ కనిపించబోతున్నాడు.
ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో బయటకు వచ్చింది. అందులో సాయి ధరమ్ తేజ్ వాయిస్ అద్దిరిపోయిందనడం అతిశయోక్తి కాదు.