సాయి పల్లవి (Sai Pallavi Challenging Roles) ఏదన్నా సినిమా చేస్తోందంటే, ఆ సినిమా కథ రొటీన్‌కి ఖచ్చితంగా చాలా భిన్నంగా వుంటుందనే అభిప్రాయం సగటు సినీ ప్రేక్షకుడిలో బలంగా నాటుకుపోయింది. అందుక్కారణం ఆమె ఎంచుకుంటున్న సినిమాలే.
తనకు ఎంత డిమాండ్ వున్నాసరే, ఆ డిమాండ్‌ని క్యాష్ చేసుకోవాలనుకోదు సాయిపల్లవి. చాలెంజింగ్ పాత్రలు పోషించడం ద్వారా తనలోని నటనా ప్రతిభను చాటుకోవాలన్నది సాయి పల్లవి ఆలోచన. ఈ విషయంలో మిగతా హీరోయిన్లెవరితోనూ సాయి పల్లవిని పోల్చలేం. ఆమె చాలా చాలా ప్రత్యేకం.
ప్రస్తుతం సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’, ‘విరాట పర్వం’ సినిమాల్లో నటిస్తోంది. మరోపక్క, ఆమె కోసం పలువురు దర్శక నిర్మాతలు ఎదురుచూస్తున్నారు.. కొందరు ఆమె ‘నో’ చెప్పేసరికి నిరాశ చెందుతున్నారట కూడా. అయితే, ఇందులో నిజమెంత.? అన్నది మాత్రం సస్పెన్సే.
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కతోన్న ఓ సినిమా కోసం తొలుత సాయిపల్లవిని అనుకుంటే, ఆమె ‘నో’ చెప్పేసిందనే ప్రచారం తెరపైకొచ్చింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కున్న ఓ సినిమా విషయంలోనూ ఇలాగే జరిగిందట. అల్లు అర్జున్ సినిమాకీ, జూ.ఎన్టీఆర్ సినిమాకీ.. ఇలానే సాయిపల్లవి నో చెప్పిందంటూ గాసిప్స్ వచ్చాయి, వస్తూనే వున్నాయి.
‘నా వరకూ నేను వేగంగా సినిమాలు చేసెయ్యాలనుకోవడంలేదు. ప్రత్యేకమైన పాత్రల కోసం ఎదురుచూస్తున్నాను. నా విషయంలో చాలా గాసిప్స్ వస్తుంటాయి. వాటన్నిటికీ సమాధానం చెప్పడానికి టైమ్ సరిపోవడంలేదు. మౌనంగా వున్నంతమాత్రాన అవన్నీ నిజం కాదు..’ అని సాయిపల్లవి ఓ సందర్భంలో చెప్పింది.
తాజాగా నితిన్ సినిమా కోసం సాయిపల్లవిని అడిగితే, ఆమె నో చెప్పిందనే గాసిప్ వినిపిస్తోంది. ‘నో’ చెప్పలేదు, ఓకే చెప్పిదంటూ ఇంకో గాసిప్ కూడా ప్రచారంలోకి వచ్చింది. సాయిపల్లవి (Sai Pallavi Challenging Roles) చుట్టూనే ఇలాంటి గాసిప్స్ ఎందుకు ఎక్కువగా వస్తుంటాయట.?