Sai Pallavi Dance.. సాయి పల్లవి మంచి డాన్సర్. అయితే, కేవలం డాన్స్ కోసమే సాయి పల్లవి.. అనడం సరికాదు. ఎందుకంటే, ఆమె చాలా మంచి నటి. ‘లవ్ స్టోరీ’ సినిమా తీసుకుంటే, అందులో డాన్స్ వుంది. అంతకన్నా మించి, నటించడానికి చాలా ఎక్కువ స్కోప్ దొరికింది సాయిపల్లవికి.
సాయిపల్లవి బాగా డాన్స్ చేస్తుంది కాబట్టి, ‘రంగస్థలం’లో జిగేలు రాణి తరహాలో.. స్పెషల్ సాంగ్ చేయాల్సి వస్తే.? ఈ ప్రశ్నకు సాయిపల్లవి సమాధానమేంటో తెలుసా.? ‘నో, నాకు అంత కంఫర్ట్‌గా వుండదు..’ అని తెగేసి చెప్పేసింది సాయిపల్లవి.
Sai Pallavi Dance స్పెషల్ సాంగ్.. ఛాన్సే లేదట..
‘జనతా గ్యారేజ్’ సినిమా కోసం కాజల్ అగర్వాల్ ఐటమ్ నంబర్‌గా మారింది. శృతి హాసన్, తమన్నా అయితే పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసేశారు. సమంత కూడా ‘పుష్ప’ సినిమా కోసం స్పెషల్ సాంగలో దుమ్ము రేపేసింది. కానీ, ఆయా సినిమాల్లో హీరోయిన్లు గ్లామర్ ప్రదర్శన ఎక్కువ చేసేశారు. ఆ విషయంలో సాయి పల్లవి మాత్రం, తన కంఫర్ట్‌నే చూసుకుంటానని తెగేసి చెప్పింది.

‘ఢీ’ డాన్స్ షో కోసం స్పెషల్ సాంగ్స్ లాంటివాటికి డాన్స్ చేసినాగానీ, పూర్తిగా కవర్ చేసుకునే డాన్స్ చేశాననీ, అది సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్‌లో కష్టమవుతుందనీ సాయి పల్లవి అసలు విషయాన్ని కుండబద్దలుగొట్టేసింది.
డాన్స్ వేరు.. స్పెషల్ సాంగ్ వేరు..
కాగా, స్పెషల్ సాంగ్ అంటే ఈ మధ్యన హీరోయిన్‌తో సమానంగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసేందుకు నిర్మాతలు ముందుకొస్తున్నారు. సాయిపల్లవి ‘ఓకే’ చెప్పాలిగానీ, కనీ వినీ ఎరుగని రీతిలో ఆమెకు రెమ్యునరేషన్ వచ్చిపడే అవకాశం వుంది. అయినాగానీ, ‘గ్లామర్ ప్రదర్శన’ అంటేనే, సాయి పల్లవి ఆమడదూరం పారిపోతుంటుంది.
Also Read: జాతిపుష్పం: ఊ అంటావా మావా.. ఊహూ అంటావా.!
నిజానికి, వరుసగా సినిమాలు చేసెయ్యడమే సాయి పల్లవికి ఇష్టం వుండదు. కథ విని, ఆ కథలో తన పాత్రకు తగిన ప్రాధాన్యముంటేనే సాయిపల్లవి (Sai Pallavi Dance) ఆయా సినిమాలకు ఓకే చెబుతుంటుంది. సో, సాయి పల్లవి నుంచి స్పెషల్ సాంగ్స్.. నో ఛాన్స్.!