Sai Pallavi Religious Row.. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో చూపించిన హింస, ఆవుల్ని తరలిస్తున్న వ్యక్తిని ఓ వర్గానికి చెందిన వ్యక్తిగా పేర్కొంటూ అతని మీద జరిపిన హింస.. రెండూ ఒకటేనా.? హీరోయిన్ సాయి పల్లవి మాత్రం ఒకటేనని అంటోంది.
ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్ళని సాయి పల్లవి, అనూహ్యంగా ఇప్పుడు వివాదాల్లో ఇరుక్కుంది. ఎందుకిలా.?
నిజానికి, సాయి పల్లవి ‘మతం కోణంలో దేన్నీ చూడొద్దు.. మతం పేరుతో హింసకు దిగవద్దు..’ అని మాత్రమే చెప్పాలనుకుంటే, దానికి వేరే ఉదాహరణలు తీసుకోవచ్చు.
మానవ సమాజంలో హింసకు తావుండకూడదు. హింసకు పాల్పడేవారిని అసలు మనుషులుగానే చూడకూడదు. ఈ విషయంలో ఎవరికీ రెండో ఆలోచన వుండాల్సిన పనే లేదు.
Sai Pallavi Religious Row.. అది వేరు, ఇది వేరు.!
కానీ, కాశ్మీరీ పండిట్లపై జరిగిన అకృత్యాల్ని ప్రపంచానికి కనపడనీయకుండా కొన్ని రాజకీయ శక్తులు పని చేశాయి. మీడియా కూడా, రాజకీయ పార్టీలకు అమ్ముడు పోయి, ఆనాటి ఘోరాల్ని ప్రపంచానికి చూపలేకపోయింది.
ఒకరు కాదు, ఇద్దరు కాదు.. వందలు, వేల మంది.. ఆ మాటకొస్తే లక్షలాది మంది కాశ్మీరీ పండిట్లను పొట్టన పెట్టుకున్నారు తీవ్రవాదం ముసుగులో, మతం ముసుగులో.
అలా తమ వారిని కోల్పోయిన ఏ కశ్మీరీ కుటుంబాన్ని సాయి పల్లవి కలిసినా, ఆమె నోట ఇప్పుడీ ప్రస్తావన వచ్చి వుండేది కాదేమో.!

ఆవుల్ని చంపడం, చంపి తినడం.. అనేది ఓ ఆహారపు అలవాటు మాత్రమే అయితే, అది వేరే చర్చ. కానీ, ఆ పేరు చెప్పి ఓ వర్గం, ఇంకో వర్గాన్ని రెచ్చగొడితేనే అసలు సమస్య.
స్వాతంత్రోద్యమం సమయంలో హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టేందుకు తూటాలకు ఆవు కొవ్వు, పంది కొవ్వు.. వినియోగించిన వైనాన్ని మనం మర్చిపోతే ఎలా.?
Also Read: ‘అంటే సుందరానికీ’ రాజకీయ రంగు, రేటింగు.!
మతం కోణంలో దేన్నీ చూడకూడదు. కానీ, మానవత్వం కోణంలో చూడాలి కదా.? ఒక హత్యకీ, వేల మంది.. లక్షల మంది హత్యకీ ఒకేలా ‘తేలిక వ్యాఖ్యలు’ చేస్తే ఎలా.? ఈ విషయంలో సాయి పల్లవి కోరి వివాదాన్ని కొనితెచ్చుకున్నట్లయ్యింది.