సాయి పల్లవి (Sai Pallavi Saranga Dariya Song) అంటేనే డాన్స్.. డాన్స్ అంటేనే సాయి పల్లవి. ఔను, సాయిపల్లవి డాన్సులకు యూ ట్యూబ్‌లో వ్యూస్ పోటెత్తుతాయ్. అది ‘మారి2’లోని (Maari 2) ‘రౌడీ బేబీ’ (Rowdy Baby Song) సాంగ్ అయినా, ‘ఫిదా’ (Fidaa) సినిమాలోని ‘వచ్చిండే..’ (Vachinde Song From Fidaa) సాంగ్ అయినా.. మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చిపడటం బహుశా సాయి పల్లవికి మాత్రమే సాధ్యమయ్యిందేమో.
‘నాకు నాతోనే పోటీ..’ అన్నట్టుగా సాగుతోంది సాయి పల్లవి ప్రభంజనం యూ ట్యూబ్‌లో. ఇప్పుడు సాయి పల్లవి నుంచే, ఇంకో సంచలనం షురూ అయ్యింది. అదే ‘సారంగ దరియా’ పాట.
శేఖర్ కమ్ముల (Sekhar Kammula Love Story) దర్శకత్వంలో రూపొందుతోన్న ‘లవ్ స్టోరీ’ సినిమాలోని పాట ఇది. ఈ సినిమాలో అక్కనేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) హీరోగా నటిస్తున్న విషయం విదితమే.
‘లవ్ స్టోరీ’ చిత్ర యూనిట్, ‘సారంగ దరియా’ పాటకు సంబంధించి లిరికల్ వీడియో విడుదల చేసింది. సాంగ్ ప్రోమో, లిరికల్ వీడియో.. రెండూ ఇప్పటికే అదరగొట్టేస్తున్నాయ్.
రేప్పొద్దున్న సినిమా విడుదలయ్యాక.. ‘సారంగ దరియా’ సాంగ్ (Sai Pallavi Saranga Dariya Song), యూ ట్యూబ్‌లో వ్యూస్ పరంగా పెను సంచలనాలనే సృష్టించబోతోందని సాయిపల్లవి అభిమానులు గంటాపథంగా చెప్పేస్తున్నారు.
శేఖర్ మాస్టర్ (Sekhar VJ Dance Master) కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణ. సాయి పల్లవి అయితే ‘పవర్ హౌస్’ అనేలా కంప్లీట్ ఎనర్జీతో డాన్స్ మూమెంట్స్ చేసేసింది. ఆ కంపోజిషన్.. ఆ పెర్ఫామెన్స్.. వెరసి, లిరికల్ సాంగ్ వీడియోలో చూపించిన ఆ కొద్ది మూమెంట్స్ పెను సంచలనంగా మారాయి.
అయితే, ‘సారంగ దరియా’ (Saranga Dariya) అనేది తెలంగాణ ఫోక్ సాంగ్ (Telangana Folk Song Saranga Dariya). ఈ ఫోక్ సాంగ్ చుట్టూ చాలా వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వాటిల్లో కొన్నింటికి 50 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయంటే, ఈ పాట ఎంత పాపులర్ అనేది అర్థమవుతుంది.
మరి, అలాంటి పాటకి సాయిపల్లవి (Sai Pallavi Dance) ఇమేజ్ తోడైతే.. ఆ రేంజ్ పదింతలవుతుందని (Sai Pallavi Saranga Dariya Song) నిస్సందేహంగా చెప్పొచ్చు. సుద్దాల అశోక్ తేజ ‘సారంగ దరియా’ పాటని ‘లవ్ స్టోరీ’ సినిమా కోసం రాశారు. మంగ్లి గాత్రం ఈ పాటకి డిఫరెంట్ పెప్ అద్దింది.
మొత్తమ్మీద, యూ ట్యూబ్‌లో ఇప్పటికే ‘సారంగ దరియా’ అంటూ చాలా వీడియోలు దర్శనమిస్తున్న దరిమిలా, వాటిల్లో కొన్ని అత్యద్భుత విజయాలు సాధించిన నేపథ్యంలో.. సాయిపల్లవి ‘సారంగ దరియా’ అంటూ యూ ట్యూబ్‌పై వేయబోయే తనదైన ముద్ర ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే.