Samantha Ruth Prabhu GymMedia.. అరరె.! అలా ఎలా ఇబ్బంది పెడతారు.? కెమెరాలేసుకుని, మొబైల్ ఫోన్లతోనూ సమంత వెంట పడటమేంటి.?
మీడియాకి బొత్తిగా బుద్ధి లేదు.! బాత్రూముల్లోకి కూడా దూరేసి, సెలబ్రిటీల ప్రైవసీని దెబ్బ తీసేయడం తప్పు కదా.?
నాన్సెన్స్.. ఇది నిజంగానే నాన్సెన్స్.! వరద బాధితుల్లా, మీడియా ప్రతినిథులు సెలబ్రిటీలు ఎక్కడ కనపడితే, అక్కడ ప్రత్యక్షమైపోతుంటారు.
ఏదో ఒక ప్రశ్న అడిగేయాలి అన్న ‘తుత్తర’ ఎక్కువైపోయి, నోటికొచ్చేసినట్లు వాగేస్తున్నారు కొందరు జర్నలిస్టులు.! ఇది సోషల్ మీడియా యుగం మరి.!
Samantha Ruth Prabhu GymMedia.. కక్కుర్తి మీడియా..
యూ ట్యూబ్ వ్యూస్ కోసమో, ఇంకో ఆలోచనతోనో.. సెలబ్రిటీల వెంట సోకాల్డ్ ఎర్నలిస్టులు ఎగబడటం చూస్తూనే వున్నాం.
కెమెరామెన్ల తీరు మరింత ఆక్షేపణీయం. గ్లామరస్ హీరోయిన్లను, వల్గర్‌గా చూపించడానికి, కెమెరాల్ని రకరకాల యాంగిల్స్‌లో తిప్పుతూ వుంటారు.
ఇక, సమంత వ్యవహారానికొస్తే, జిమ్ములో కసరత్తులు పూర్తయ్యాక, తన కారు కోసం బయటకు వచ్చిన సమంత వెంట పడ్డారు కొందరు కెమెరామెన్లు.
‘గుడ్ మార్నింగ్ సమంత మేడమ్..’ అని వాళ్ళంతా అనగానే, సమంతకి ఒళ్ళు మండిపోయింది. డ్రెస్సు కంఫర్టబుల్‌గా లేకపోవడం వల్లే సమంత అలా గుస్సా అయ్యిందా.?
డబ్బులిచ్చి రప్పించుకుని…
అబ్బే, అంతకన్నా దారుణంగా వల్గర్ డ్రెస్సులు వేసి మరీ, కెమెరాల ముందుకొస్తుంటారు హీరోయిన్లు.. సో, అది కారణం కాకపోవచ్చు.
సెలబ్రిటీలే, కెమెరామెన్లకు డబ్బులు ఇచ్చి మరీ, జిమ్ములకు రప్పించుకుంటుంటారు.. జిమ్ బయట, లోపల ఫొటోలు, వీడియోలకు అవకాశం ఇస్తుంటారు.
సమంత విషయంలో ఏం జరిగింది.? సమంత పిలవకుండానే, మీడియాకి చెందిన కెమెరామెన్లు వెళ్ళారా.? అందుకే, సంతకి అంతలా కోపం కట్టలు తెంచుకుందా.?
Also Read: దీపిక పదుకొనె స్కూల్.! కొత్త జర్నీ షురూ.!
లేదంటే, ఇంకేదో టెన్షన్‌లో వున్న సమంతని, మీడియా ప్రతినిథులే ఇబ్బంది పెట్టారా ఫొటోలు, వీడియోల కోసం.? ఇలా బోల్డన్ని ప్రశ్నలు.
ఒక్కటి మాత్రం నిజం.. మీడియా ఒకింత సిగ్గు పడాలి ఇలాంటి విషయాల్లో. సెలబ్రిటీల మీదకు ఎగబడటం.. అనే కక్కుర్తిని మీడియా ప్రతినిథులే మానుకోవాలి.