Salaar Box Office Scam.. నిజమేనా.? ఇదో పెద్ద స్కామ్ అనుకోవచ్చా.? ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్ – సీజ్ ఫైర్’ మీద స్కామ్ ఆరోపణలు ఎందుకొస్తున్నాయ్.?
ప్రభాస్, పృధ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్’ నుంచి తొలి పార్ట్ ‘సలార్ సీజ్ ఫైర్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
2023లో అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదలైన సినిమాల్లో ‘సలార్’ కూడా ఒకటి.! పాన్ ఇండియా స్థాయిలో అనూహ్యమైన క్రేజ్‌ని విడుదలకు ముందే.. ఆ మాటకొస్తే, కాంబినేషన్ అనౌన్స్‌మెంట్‌తోనే సంపాదించుకుంది.
సినిమా విడుదలయ్యింది.. కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు.! కానీ, వందల కోట్ల రూపాయల వసూళ్ళంటూ ఎడా పెడా ప్రకటనలు వచ్చేశాయ్.!
Salaar Box Office Scam.. వందల కోట్లు.. వేల కోట్లు..
వెయ్యి కోట్ల క్లబ్బులోకి చేరే సినిమా.. అంటూ ప్రచారం ఊదరగొట్టేయడంతో, అంతా ముక్కున వేలేసుకున్నారు. రోజులు గడుస్తున్నాయ్.. టిక్కెట్లు తెగడం పలచబడిపోయింది. అదీ రెండు మూడు రోజులకే.!
ఇంకోపక్క, కార్పొరేట్ టిక్కెట్ బుకింగ్ స్కామ్.. అంటూ ‘సలార్’ మీద ఆరోపణలు షురూ అయ్యాయి. ఇందులో వాస్తవమెంత.?

నిజానికి, ఇటీవలి కాలంలో చాలా సినిమాల మీద ఈ తరహా ఆరోపణలు వస్తున్నాయ్. పెద్ద సంఖ్యలో టిక్కెట్లను ఉచితంగా ముందే పంపిణీ చేసేస్తున్నారు.
మీడియా సంస్థల ద్వారా కాంటెస్టులు పెట్టించి మరీ టిక్కెట్లు పంచేయడం ఓ ట్రెండ్ అయిపోయింది. అది కూడా ప్రభాస్ సినిమాలకి ఎక్కువగా జరుగుతోంది.
ప్రభాస్‌కే ఎందుకిలా.?
‘ఆదిపురుష్’ విషయంలో ఏం జరిగిందో చూశాం. ‘సాహో’ సినిమా విషయంలోనూ, ‘రాదేశ్యామ్’ విషయంలోనూ అదే జరిగింది. ఇప్పుడు ‘సలార్ సీజ్ ఫైర్’ పరిస్థితీ అదే.
వందల సంఖ్యలో కాదు, వేల సంఖ్యలో టిక్కెట్లను ఉచితంగా పంచి పెట్టడం వల్ల నిర్మాతకు లాభమేంటి.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.
‘పబ్లిసిటీ ఖర్చు కూడా దండగ’ అనే స్తాయికి కొన్ని పెద్ద సినిమాలు 2023లో దెబ్బ తిన్నాయ్.! ఇప్పుడు కార్పొరేట్ స్కామ్.. అంటూ తెలుగు సినిమా మీద పెద్ద మచ్చే పడుతోంది.
అత్యంత ప్రమాదకరమైన సంకేతం ఇది.! Salaar Box Office Scam అంటూ సోషల్ మీడియాలో ఓ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోందంటే, ఈ విషయమై సినీ జనం ఒకింత ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంది.